Latest

మహిళా ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు కావాలి
Local· 27 Aug 2026

మహిళా ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు కావాలి

AP: మహిళా ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, సబ్సిడీ రుణాలతో ఆటోలు అందించాలని తిరుపతి జిల్లా సీఐటీయూ ఆటో యూనియన్‌ నూతన జిల్లా సహాయ కార్యదర్శి పి. దీప డిమాండ్‌ చేశారు. పుత్తూరులో జరిగిన ఆటో యూనియన్‌ సమావేశంలో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. రేణిగుంట మండలానికి చెందిన పి. దీపను జిల్లా సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా అనేక మంది మహిళలు ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు.

నిరుపేదలకు అండగా వెల్‌ విషర్‌ ట్రస్ట్‌
Local· 27 Aug 2026

నిరుపేదలకు అండగా వెల్‌ విషర్‌ ట్రస్ట్‌

AP: మదర్‌ థెరిసా స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అండగా నిలవడం అభినందనీయమని మంగళగిరి మున్సిపల్‌ కమిషనర్‌ అలీమ్‌ బాషా అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి బాప్టిస్ట్‌పేటలో వెల్‌ విషర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రథమ వార్షికోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. షైన్‌ ఆశ్రమానికి రూ.10 వేల ఆర్థికసాయం అందించారు. వికలాంగుల విద్యకోసం మరో రూ.8వేల సహాయాన్ని అందజేశారు.

Fanta నుంచి Maggi వరకు.. దేశానికో ఫార్ములా!
International· 27 Aug 2026

Fanta నుంచి Maggi వరకు.. దేశానికో ఫార్ములా!

ఒకే బ్రాండ్.. కానీ దేశం మారితే రుచి, పదార్థాలు కూడా ఎందుకు మారిపోతాయి? లండన్‌లో దొరికే Fantaతో పోలిస్తే భారత్‌లో అమ్మే Fantaలో చక్కెర దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉందని తాజా రిపోర్ట్ చెబుతోంది. భారత్‌లో సాధారణ KitKatలో కోకో 4.5% ఉండగా, ఆస్ట్రేలియా వెర్షన్‌లో కనీసం 22% ఉంది. అలాగే భారత్‌లోని Maggiలో పామ్ ఆయిల్ వాడుతుండగా, బ్రిటన్‌లోని కొన్ని వెర్షన్లలో సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారు. రుచి, ధర, స్థానిక రూల్స్, అక్కడి మార్కెట్‌కు తగ్గట్టుగా కంపెనీలు ఫార్ములాను మార్చడం వల్లే ఈ తేడాలు వస్తున్నాయి.

బర్త్‌డే పార్టీ నుంచి వస్తుండగా ఘోర ప్రమాదం
AP· 27 Aug 2026

బర్త్‌డే పార్టీ నుంచి వస్తుండగా ఘోర ప్రమాదం

AP: పల్నాడు జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్‌ వద్ద ఆటోను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఏడుగురు స్పాట్‌లో మరణించారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో గుంటూరు GGHకు తీసుకెళ్లారు. మృతులంతా వేలూరు గ్రామస్థులుగా పోలీసులు గుర్తించారు. ప్రకాశం జిల్లా కొండమంజులూరులో జరిగిన బర్త్‌డే పార్టీకి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు బుక్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

బావిలో పడిన యువతి.. కాపాడిన కానిస్టేబుల్
Local· 27 Aug 2026

బావిలో పడిన యువతి.. కాపాడిన కానిస్టేబుల్

TG: ప్రమాదంలో చిక్కుకున్న ఓ దివ్యాంగ యువతికి కానిస్టేబుల్ దిలీప్ ఆపద్బాంధవుడిగా నిలిచారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎపూర్ గ్రామంలో ఓ దివ్యాంగ యువతి ప్రమాదవశాత్తు చేతిబావిలో పడిపోయింది. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ దిలీప్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బావిలోకి దిగారు. లోతులో ఉన్న యువతి వద్దకు చేరుకుని, తాళ్ల సహాయంతో ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సమయస్ఫూర్తితో స్పందించి సాహసోపేతంగా వ్యవహరించడంతో యువతి ప్రాణాలు దక్కాయి.

ల్యాబ్‌లో పెంచిన మెదడు కణాలు
Technology· 27 Aug 2026

ల్యాబ్‌లో పెంచిన మెదడు కణాలు

మనిషి మెదడును ల్యాబ్‌లో ఏళ్ల తరబడి పెంచగలరా? సైంటిస్టులు మనిషి స్టెమ్ సెల్స్‌తో తయారు చేసిన చిన్న మెదడు కణాల సమూహాలను దాదాపు 7 ఏళ్ల పాటు ల్యాబ్‌లో పెంచారు. ఇవి పూర్తి మనిషి మెదడు కాదు.. కానీ మెదడులోని కణాలు కాలంతో ఎలా మారుతాయో తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఏళ్లు గడిచేకొద్దీ ఈ కణాల్లో సహజమైన మెదడు ఎదుగుదలను పోలిన మార్పులు కనిపించాయి. దీంతో మెదడు ఎలా అభివృద్ధి చెందుతుంది, కొన్ని వ్యాధులు ఎలా మొదలవుతాయో అర్థం చేసుకోవడానికి కొత్త దారి కనిపించొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు.

బౌద్ధం, కళలతో శతాబ్దాల బంధం: మంత్రి జూపల్లి
International· 27 Aug 2026

బౌద్ధం, కళలతో శతాబ్దాల బంధం: మంత్రి జూపల్లి

తెలంగాణ–శ్రీలంక మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు సాంస్కృతిక మార్పిడిని విస్తరించాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బౌద్ధం, సంస్కృతి, కళలు ఇరు ప్రాంతాల మధ్య శతాబ్దాల అనుబంధానికి ప్రతీకలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన నృత్యాంగణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన శ్రీలంక కళాకారుల బృందం సచివాలయంలో మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా కళాకారులను మంత్రి సన్మానించారు. శ్రీలంక సంప్రదాయ నృత్యాలను తెలంగాణలో ప్రదర్శించడం అభినందనీయమని అన్నారు.

ఘోర ప్రమాదం.. ఆరుగురు Spot Dead
AP· 27 Aug 2026

ఘోర ప్రమాదం.. ఆరుగురు Spot Dead

AP: విజయవాడ నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, చిలకలూరిపేట దగ్గర్లో ఓ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఆటో డ్రైవర్ సడెన్‌గా టర్న్ తీసుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జవడంతో అందులో ఉన్న ఆటో డ్రైవర్ బాబు, మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మీ గంగమ్మ, మరియమ్మ, సువార్తమ్మ మరణించారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్లని హాస్పిటల్‌కి తరలించారు.

CM స్పందించకుంటే సెక్రటేరియట్‌ను ముట్టడిస్తాం: హరీశ్‌రావు
TG· 27 Aug 2026

CM స్పందించకుంటే సెక్రటేరియట్‌ను ముట్టడిస్తాం: హరీశ్‌రావు

TG: పదేళ్ల KCR పాలన ప్రజలే కేంద్రంగా సాగితే.. ప్రస్తుత రేవంత్‌ పాలన మాత్రం భూములే కేంద్రంగా సాగుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. హైదరాబాద్‌ KPHBలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రజల ఆస్తులను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫైరయ్యారు. 22ఏ జాబితా నుంచి భూములను తొలగించకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తామని, CM స్పందించకుంటే సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రేవంత్ ప్రభుత్వం రూ.30వేల కోట్ల విలువైన భూములు విక్రయించిందని ఆరోపించారు.

సీనియర్ నటుడు నారాయణరావు కన్నుమూత
Entertainment· 27 Aug 2026

సీనియర్ నటుడు నారాయణరావు కన్నుమూత

సీనియర్ నటుడు, నిర్మాత నారాయణరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న అర్ధరాత్రి హైదరాబాద్‌లో మరణించారు. చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో రజినీకాంత్‌తో కలిసి చదువుకున్న నారాయణరావు 'అంతులేని కథ', 'నాలాగా ఎందరో', 'ఒక ఊరి కథ', 'గణేష్' లాంటి అనేక సినిమాల్లో యాక్ట్ చేశారు. చిరంజీవి హీరోగా 'దేవాంతకుడు', 'యముడికి మొగుడు' సినిమాలను ప్రొడ్యూస్ చేశారు.

కాంగోలో Ebola అదుపు తప్పుతోందా?
National· 27 Aug 2026

కాంగోలో Ebola అదుపు తప్పుతోందా?

Ebola మళ్లీ పెద్ద ప్రమాదంగా మారుతోంది.. ముఖ్యంగా డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో పరిస్థితి వేగంగా క్షీణిస్తోంది. ఈసారి అరుదైన బుండిబుగ్యో వైరస్ వ్యాపిస్తోంది. ఆగస్టు 23 నాటికి 5,514 కేసులు, 2,642 మరణాలు నమోదయ్యాయి. గత వారం ఒక్కటిలోనే 300 మందికి పైగా చనిపోయారు. వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉండటంతో దీన్ని అదుపులోకి తేవడం కష్టమవుతోంది. పైగా ప్రభావిత ప్రాంతాల్లో ఘర్షణలు, రోడ్లు-వైద్య సదుపాయాల కొరత, ఆరోగ్య సిబ్బందిపై దాడులు పరిస్థితిని మరింత కష్టంగా మారుస్తున్నాయి.

గ్లోబల్ కంపెనీల ఫస్ట్ ఛాయిస్ హైదరాబాద్: మంత్రి
TG· 27 Aug 2026

గ్లోబల్ కంపెనీల ఫస్ట్ ఛాయిస్ హైదరాబాద్: మంత్రి

TG: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (GCC)కు హైదరాబాద్ ప్రపంచస్థాయి కంపెనీల తొలి ఎంపికగా మారుతోందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. గత ఏడాది తెలంగాణకు 75 GCC లు వచ్చాయని, వచ్చే ఏడాది మరో 100 సెంటర్లను రాష్ట్రానికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. హైదరాబాద్ హైటెక్‌సిటీలో ఆక్టేవ్ ఇంటెలిజెన్స్ ఏర్పాటుచేసిన గ్లోబల్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. HYDలో ఐటీతోపాటు స్పోర్ట్స్ టెక్నాలజీ, హాస్పిటాలిటీ, క్యాపిటల్ మార్కెట్స్ వంటి విభిన్నరంగాల్లో సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయన్నారు.

దేశానికే ఆదర్శంగా AP హెల్త్ మోడల్ : చంద్రబాబు
AP· 27 Aug 2026

దేశానికే ఆదర్శంగా AP హెల్త్ మోడల్ : చంద్రబాబు

ఆరోగ్య సేవల్లో భారీ మార్పులకు AP ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1నుంచి ‘సంజీవని’ ప్రాజెక్టును అమలు చేయాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఉండవల్లి క్యాంపు ఆఫీస్‌లో నిర్వహించిన సమీక్షలో ప్రాజెక్టు విస్తరణకు రూపొందించిన 90రోజుల కార్యాచరణను అధికారులు CMకు వివరించారు. కుప్పం, చిత్తూరులో సంజీవని ద్వారా మంచి ఫలితాలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని నిర్ణయించారు. AI ఆధారిత వైద్యసేవలు, డిజిటల్ హెల్త్ రికార్డులు, వ్యాధుల ముందస్తు గుర్తింపునకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

AI మనల్ని Smart చేస్తుందా… లేక Lazyగానా?
Technology· 26 Aug 2026

AI మనల్ని Smart చేస్తుందా… లేక Lazyగానా?

AIకి మన పనులన్నీ అప్పగించేస్తే.. మెదడుకి పని తగ్గిపోతుందా? ఒక మెయిల్ రాయడం నుంచి ఐడియా చెప్పడం వరకు AI పనులను సెకన్లలో చేసి పెడుతోంది. దీంతో టైమ్ సేవ్ అవుతుంది. కానీ ప్రతి సందేహానికి AIనే అడిగి, ఆలోచించే పనినీ దానికి అప్పగిస్తే.. మనమే ఆలోచించి సమస్యను పరిష్కరించే అలవాటు తగ్గొచ్చు. 2025లో 319 మంది జ్ఞాన ఆధారిత ఉద్యోగులపై అధ్యయనంలో, AIపై ఎక్కువ నమ్మకం ఉన్నవాళ్లు క్రిటికల్ థింకింగ్‌కు తక్కువ శ్రమ పెట్టినట్లు కనిపించింది. అంటే AI మంచిదా చెడ్డదా అనేది కాదు.. దాన్ని ఎలా వాడుతున్నామన్నదే అసలు విషయం.

మంచి AI మోడల్ ఎవరికి దక్కుతోంది?
Technology· 26 Aug 2026

మంచి AI మోడల్ ఎవరికి దక్కుతోంది?

అందరికీ ఒకే AI మోడల్ అందుబాటులో ఉంటుందా? ఇప్పుడు ఈ ప్రశ్నపై పెద్ద చర్చ మొదలైంది. కొన్ని సంస్థలు తమ అత్యంత శక్తివంతమైన AI మోడళ్లను అందరికీ ఒకేలా ఇవ్వకుండా, కొన్ని రకాల పనులకు పాత లేదా తక్కువ శక్తి ఉన్న మోడల్‌కి మార్చుతున్నాయి. మరోవైపు, కొన్ని ప్రత్యేక భాగస్వాములు, పరిశోధకులకు మాత్రం ఎక్కువ సామర్థ్యాలతో కూడిన మోడళ్లకు యాక్సెస్ ఇస్తున్నారు. దీంతో AI భద్రత పేరుతో మంచి టెక్నాలజీ కొద్దిమందికే పరిమితం అవుతుందా? అనే ప్రశ్న వస్తోంది.

మన మెదడులోనే కంప్యూటర్!
National· 26 Aug 2026

మన మెదడులోనే కంప్యూటర్!

మన మెదడులోనే ఓ చిన్న కంప్యూటర్ ఉంటే ఎలా ఉంటుంది? ఇది సైన్స్ ఫిక్షన్‌లా అనిపించినా.. సైంటిస్టులు ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మెదడులో అమర్చే చిన్న చిప్స్ ద్వారా మన ఆలోచనలతోనే కంప్యూటర్‌ను కంట్రోల్ చేసే టెక్నాలజీపై రీసెర్చ్ జరుగుతోంది. పక్షవాతం లేదా శరీరాన్ని కదపలేని వారికి ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడొచ్చు. అయితే ఇది సాధారణ మనుషుల కోసం వెంటనే అందుబాటులోకి రాదు. చిప్‌ను సురక్షితంగా అమర్చడం, శరీరం దాన్ని అంగీకరించడం, డేటా భద్రత వంటి సమస్యలు ఇంకా ఉన్నాయి.

కొన్ని క్షణాల్లోనే అంతా కొట్టుకుపోయింది!
National· 26 Aug 2026

కొన్ని క్షణాల్లోనే అంతా కొట్టుకుపోయింది!

నేపాల్–టిబెట్ సరిహద్దులో ఒక్కసారిగా మట్టి, రాళ్లు, నీటితో భారీ వరద దూసుకురావడంతో తీవ్ర నష్టం జరిగింది. నేపాల్‌లో ఇప్పటివరకు 95 మంది చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు వందల మంది ఆచూకీ తెలియడం లేదు. ఇళ్లు, రోడ్లు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులు వరదలో కొట్టుకుపోయాయి. కొండపై నుంచి భారీగా మట్టి, రాళ్లు నదిలోకి జారిపడటంతో ఈ వరద మొదలై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి. దెబ్బతిన్న రోడ్ల కారణంగా కొన్ని ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా మారింది.

Metaకి భారీ షాక్.. $17.1B సెటిల్‌మెంట్!
National· 26 Aug 2026

Metaకి భారీ షాక్.. $17.1B సెటిల్‌మెంట్!

Metaకి భారీ దెబ్బ తగిలింది! అమెరికాలోని 47 రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీ సహా ఇతర ప్రాంతాలు దాఖలు చేసిన కేసుల నుంచి బయటపడేందుకు Meta $17.1B వరకు చెల్లించేలా సెటిల్‌మెంట్‌కు ఒప్పుకుంది. Facebook, Instagramలో పిల్లలు, టీనేజర్లను ఎక్కువసేపు ఉండేలా చేసే ఫీచర్లు పెట్టారని, వాటి వల్ల యువతకు హాని జరుగుతుందని తెలిసినా సంస్థ చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి. Meta మాత్రం ఎలాంటి తప్పు చేయలేదని చెబుతోంది. ఈ ఒప్పందానికి కోర్టు ఆమోదం ఇంకా రావాల్సి ఉంది.

79లోనూ పని ఆపని వ్యక్తి కథ!
National· 26 Aug 2026

79లోనూ పని ఆపని వ్యక్తి కథ!

79 ఏళ్ల వయసులోనూ రోజూ సైకిల్‌పై పార్సల్స్ ఇస్తున్న ఓ వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన సీకే ముఖర్జీ గత 33 ఏళ్లుగా కొరియర్ పని చేస్తున్నారు. ఎండైనా, వానైనా సైకిల్‌పై తిరుగుతూ పార్సల్స్ అందిస్తున్నారు. ఇంత వయసులోనూ ఇలా ఎలా పనిచేస్తున్నారని అడిగితే.. తనకు జనాలు ఇచ్చే ప్రేమ, గౌరవమే ముందుకు వెళ్లే బలమని చెప్పారు. ఇటీవల రెండు కళ్లకు ఆపరేషన్ జరిగినా పని ఆపలేదు. కుటుంబాన్ని చూసుకోవడానికి కూడా ఈ పని కొనసాగిస్తున్నానని చెప్పారు.

వయసు పెరిగేకొద్దీ మెదడులో ఏం మారుతోంది?
International· 26 Aug 2026

వయసు పెరిగేకొద్దీ మెదడులో ఏం మారుతోంది?

చిన్నప్పుడు మెదడులో కొత్త కణాలు తయారయ్యే వేగం ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగేకొద్దీ ఈ ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీన్నే న్యూరోజెనెసిస్ అంటారు. ముఖ్యంగా మెదడులోని హిప్పోకాంపస్‌లో కొత్త న్యూరాన్స్ తయారయ్యే విధానంపై సైంటిస్టులు చాలాకాలంగా రీసెర్చ్ చేస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ Neural Stem Cells సంఖ్య తగ్గడం దీనికి కారణంగా భావిస్తున్నారు. పెద్దవాళ్లలో కొత్త న్యూరాన్స్ నిజంగా తయారవుతాయా అనే విషయంలో ఇంకా చర్చ కొనసాగుతోంది. తాజా రీసెర్చ్ మాత్రం పెద్దవాళ్లలోనూ ఈ ప్రక్రియకు ఆధారాలు ఉన్నాయని సూచిస్తోంది.

అన్న మృతదేహానికి రాఖీ కట్టి సాగనంపిన చెల్లి
Local· 26 Aug 2026

అన్న మృతదేహానికి రాఖీ కట్టి సాగనంపిన చెల్లి

TG : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ చటాన్‌పల్లి గ్రామంలో జమాల్పూర్ నవీన్ ఎలక్ట్రిక్ వర్క్ చేస్తూ కరెంట్ షాక్‌తో చనిపోయాడు. రాఖీ పౌర్ణమికి అన్నయ్యకు కడదామని చెల్లెలు పూజిత ముందే రాఖీ కొని పెట్టుకుంది. కానీ, పండుగకి రెండు రోజుల ముందే అన్న చనిపోవడంతో కుటుంబం చాలా బాధలో ఉన్నారు. అంతిమయాత్ర టైమ్‌లో ఆ చెల్లి తన అన్నయ్య శవానికి రాఖీ కట్టి, 'ఇదే నేను అన్నకి కట్టే లాస్ట్ రాఖీ' అని ఏడుస్తుంటే అక్కడ ఉన్నవాళ్లంతా కంటతడి పెట్టారు.