శాన్ డియాగో మసీదులో కాల్పులు .. ముగ్గురు మృతి

అమెరికాలోని శాన్ డియాగోలో దారుణం జరిగింది. ఒక మసీదు ప్రాంగణంలోకి చొరబడిన ఇద్దరు టీనేజ్ సాయుధులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత నిందితులిద్దరూ శవాలుగా కనిపించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆయుధాలపై యాంటీ ముస్లిం మెసేజ్లు, సూసైడ్ నోట్ దొరకడంతో FBI రంగంలోకి దిగి దీనిని Hate Crime కోణంలో క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటన ఈద్‌కు ముందు జరగడం అక్కడి ముస్లిం కమ్యూనిటీలో భయాందోళనలు పెంచింది.
