అదానీ VS అమెరికా: ₹1,210 కోట్ల భారీ సెటిల్‌మెంట్‌తో కేసులన్నీ క్లోజ్

పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసులన్నీ పర్మనెంట్ గా క్లోజ్ అయ్యాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ కోసం భారత్‌లో కాంట్రాక్టులు దక్కించుకునేందుకు భారీగా లంచాలు ఆఫర్ చేశారంటూ Fraud, Bribery కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసుల్ని అదానీ సెటిల్ మెంట్ చేసుకున్నారు. అదానీ గ్రూప్ మొత్తం $145 మిలియన్ డాలర్లు మన కరెన్సీలో ₹1,210 కోట్లు సివిల్ పెనాల్టీ చెల్లించడానికి అంగీకరించింది. ఈ మొత్తంలో సెక్యూరిటీ అండ్ ఎక్స్ చేంజ్ కమిషన్ కు $85 మిలియన్లు, జస్టిస్ డిపార్ట్ మెంట్ కి $60 మిలియన్లు చెల్లిస్తారు. దీంతో అమెరికా కేసులన్నీ క్లోజ్ చేసింది.
