Latest

నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు! DGPకి CM వార్నింగ్!
CM రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ వల్ల సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకూడదని క్లియర్‌గా చెప్పారు. ఇవాళ ఢిల్లీ వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర vehicles ఆపేయడం పై ఆయన Serious అయ్యారు. CM వెళ్తున్నప్పుడు రోడ్లు బ్లాక్ చేయకుండా, సింగిల్ లైన్ రోడ్డు వాడాలని సూచించారు. నెగ్లెక్ట్ గా వ్యవహరించే ఆఫీసర్స్ పై action తీసుకోవాలని DGPని ఆదేశించారు. త్వరలోనే స్టేట్ వైడ్ Traffic Bureau కూడా ఏర్పాటు చేయబోతున్నారు.

విజయ్‌కు గవర్నర్ షాక్! 118 మంది MLAలు ఉంటేనే CM సీటు!
TVK చీఫ్ విజయ్‌కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ బిగ్ షాక్ ఇచ్చారు. governament form చేయడానికి కావాల్సిన 118 మంది MLA లని విజయ్ ఇంకా చూపించలేకపోయారు. ప్రెసెంట్ కాంగ్రెస్‌తో కలిపి విజయ్ దగ్గర 112 మంది MLAలు మాత్రమే ఉన్నారు. మెజారిటీకి ఇంకా 6 మంది MLAలు తక్కువగా ఉండటంతో గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో విజయ్ CM అయ్యే విషయంపై present Suspense కొనసాగుతోంది.

ముంబై టీమ్‌లో హార్దిక్ పాండ్య ను కెప్టెన్సీ నుంచి తీసేశారా?
IPL 2026లో ముంబై ఇండియన్స్ టీమ్‌లో ఏం జరుగుతుందో అర్థం కాక ఫ్యాన్స్ Full Confuse అవుతున్నారు. మే 10న RCBతో మ్యాచ్ కోసం MI ప్లేయర్స్ అంతా రాయ్‌పుర్ వెళ్లారు, కానీ హార్దిక్ పాండ్య ఎయిర్‌పోర్ట్‌లో కనిపించలేదు. లాస్ట్ మ్యాచ్‌లో హార్దిక్ లేకపోయినా సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమ్ అద్భుతంగా ఆడి గెలిచింది. దీంతో హార్దిక్‌ను కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టారా అనే డౌట్ అందరిలో స్టార్ట్ అయింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో కూడా హార్దిక్ Performance దారుణంగా ఉండటంతో మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుందా అని చర్చ నడుస్తోంది.

కాషాయం కట్టుకున్న భారత్.. తగ్గిపోతున్న ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య
పశ్చిమ బెంగాల్, అసోంలో విజయంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే దేశంలో 22 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. దీంతో ఇండియన్ పొలిటికల్ ఫేస్ మారిపోతోంది. అసెంబ్లీలలో ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోవడం కనిపిస్తోంది. 2013లో ముస్లిం ఎమ్మెల్యేలు 339 మంది ఉంటే, ఇప్పుడు వారి సంఖ్య 282కి పడిపోయింది. యూపీలో ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య 63 నుండి 31కి తగ్గితే పశ్చిమ బెంగాల్లో 59 నుండి 37కి, బీహార్19 నుండి 11కి , రాజస్థాన్11 నుండి 6కి తగ్గింది. మొత్తం ఏడు రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిమ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేరు.

దేశంలో నే సరికొత్త నిర్ణయం తీసుకున్న కొత్త సీఎం విజయ్ !!
. తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి,టీవీకె పార్టీ అధ్యక్షుడు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రమాణ స్వీకారానికి అయ్యే ఖర్చును పార్టీ నిధుల నుంచే భరించాలని విజయ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ తరహా ట్రెండ్ దేశంలోనే తొలిసారి.సాధారణంగా సీఎం ప్రమాణ స్వీకారం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వస్తుంది. తన ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను విజయ్ ఆహ్వానించారు. రాహుల్ , ఖర్గేలతో విజయ్ ఫోన్ లో మాట్లాడారని కాంగ్రెస్ నేత ప్రవీణ్ చక్రవర్తి తెలిపారు.

టీమిండియాలోకి 15years వైభవ్ సూర్యవంశీ?
IPL 2026లో తన బ్యాటింగ్‌తో అదరగొడుతున్న యంగ్ స్టార్ వైభవ్ సూర్యవంశీపై, వెస్టిండీస్ లెజెండ్ ఇయాన్ బిషప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఎంచుకున్న India B Teamలో వైభవ్‌కు ఓపెనర్‌గా ఛాన్స్ ఇచ్చారు. వైభవ్ ఆడుతున్న తీరు చూస్తుంటే, అతను International Cricketకు పక్కాగా రెడీ అయిపోయాడని బిషప్ నమ్ముతున్నారు. త్వరలో జరిగే ఐర్లాండ్ టూర్లో వైభవ్ టీమిండియాలోకి Entry ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

గవర్నర్ ని కలిసిన విజయ్… కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం
టీవీకే అధినేత విజయ్ ఇవాళ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ను కలుసుకున్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. బలనిరూపణకు 15 రోజులు గడువు అడిగారు. కాంగ్రెస్ తో టీవీకే పొత్తు ఇప్పటికే ఖరారైంది. మరో అయిదుగురు ఎమ్మెల్యేల మద్దతు ఉంటే సరిపోతుంది. మరోవైపు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో రేపు విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాల్సిందిగా లెఫ్ట్ పార్టీల మద్దతు విజయ్ కోరారు. ఇంకా ఎవరెవరు విజయ్ కి కలిసివస్తారో చూడాలి.
భారత్ కు పాక్ సాయం!
గుజరాత్ నుంచి బయలుదేరిన 'ఎంవీ గౌతమ్' అనే కార్గో షిప్ అరేబియా సముద్రంలో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగిపోయింది. షిప్లో ఉన్న ఆరుగురు ఇండియన్స్‌తో పాటు మరొకరు ప్రమాదంలో పడ్డారు. ముంబై రెస్క్యూ సెంటర్ నుంచి పాక్ కి మెసేజ్ అందగానే పాకిస్థాన్ నేవీ వెంటనే స్పందించింది. పెట్రోలింగ్ చేస్తున్న తమ నౌకతో వచ్చి అందరినీ కాపాడారు. వాళ్లకు ఫుడ్, మెడిసిన్ ఇచ్చి పాకిస్థాన్ ఆఫీసర్స్ తమ మానవత్వాన్ని చాటుకున్నారు.

టీఎంకే కాంగ్రెస్ పొత్తు ఖరారు...డీఎంకేతో 55 ఏళ్ల బంధానికి తెర
తమిళనాడులో 55 ఏళ్ల నాటి డీఎంకే-కాంగ్రెస్ కూటమికి తెరపడింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అనూహ్యంగా విజయ్ నేతృత్వంలోని TVK కి మద్దతు ప్రకటించింది. తమ సహకారంతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, అయితే మతతత్వ శక్తులను దూరంగా ఉంచాలనే షరతు విధించింది. దీనికి విజయ్ అంగీకరించారని కాంగ్రెస్ అధికారికంగా స్టేట్ మెంట్ రిలీజ్ చేసింది. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం తమిళ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు దారితీసింది. విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.

నకిలీ బాబా దారుణం.. వైద్యం పేరుతో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం
మహారాష్ట్రలోని పాల్ఘర్లో దారుణం జరిగింది. 55 ఏళ్ల శివరామ్ సావర్ అనే వ్యక్తి ఒక వైద్యుడిగా నమ్మించి, నెలసరి సమస్యలకు మందు ఇస్తానంటూ 13 ఏళ్ల బాలికను అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ బాలికకు వైద్య సహాయం అందుతోంది. ఇలాంటి మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలి.
తలలో కొడవలి దిగినా.. ఫోన్ వాడుతూ హాస్పిటల్‌కు వచ్చిన యువకుడు
ముంబైలోని సియాన్ ఆసుపత్రిలో ఒక యువకుడు తలలో కొడవలి (కోయతా) దిగబడి ఉండగానే నడుచుకుంటూ రావడం చూసి అందరూ షాక్ అయ్యారు. విక్రోలి ప్రాంతానికి చెందిన ఈ వ్యక్తి, ఆ స్థితిలో కూడా స్పృహలో ఉండి ఫోన్ వాడుతూ కనిపించిన వీడియో వైరల్ అయ్యింది. పాత కక్షల వల్ల జరిగిన ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేయగా, డాక్టర్లు సర్జరీ చేసి ఆ ఆయుధాన్ని విజయవంతంగా తొలగించారు.

టెస్టుల పేరుతో పసిపాపను అమ్మేసిన నర్సులు!
మెదక్ లైఫ్ కేర్ హాస్పిటల్లో ఒక దారుణమైన incident బయటపడింది. అక్కడ పుట్టిన ఒక Baby Girlను నర్సులు టెస్టుల పేరుతో తీసుకెళ్లారు. ఆ తర్వాత పాప చనిపోయిందని అబద్ధం చెప్పి, పేరెంట్స్‌ని నమ్మించారు. కానీ సీక్రెట్‌గా ఆ పాపను రూ.1.50 లక్షలకు వేరే వాళ్ళకి అమ్మేశారు. పేరెంట్స్‌కు Doubt వచ్చి పోలీసులకు చెప్తే అసలు విషయం తెలిసి అందరూ షాక్ అయ్యారు. పోలీసులు ఇద్దరు నర్సులతో పాటు పాపను కొన్నవాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. కలెక్టర్ స్పందించి వెంటనే ఆ హాస్పిటల్‌ను సీజ్ చేయించారు. ఈ హాస్పిటల్ లో గతంలో కూడా ఇలాంటి అక్రమాలు ఇంకేమైనా చేశారా అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

జలంధర్‌లో జంట పేలుళ్లు!
పంజాబ్ జంట పేలుళ్లతో ఒక్కసారిగా దద్దరిల్లింది. కేవలం రెండు గంటల వ్యవధిలో జలంధర్ BSF హెడ్ క్వార్టర్స్ మరియు అమృత్సర్ ఆర్మీ కంటోన్మెంట్ సమీపంలో పేలుళ్లు జరగడం తీవ్ర కలకలం రేపింది. ఆర్మీ యూనిట్లే లక్ష్యంగా ఈ ఘటనలు జరగడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. భద్రతా బలగాలు అప్రమత్తమై విచారణ చేపడుతున్నాయి. ఇది కచ్చితంగా హై-అలర్ట్ సిట్యుయేషన్!
బ్లౌజ్ మొత్తం Diamonds! అంబానీ వారసురాలి రేంజే వేరు!
మెట్ గాలా 2026లో ఈషా అంబానీ తన స్టైల్ తో అందరికీ షాక్ ఇచ్చారు. ఆమె కట్టుకున్న సారీని ప్యూర్ గోల్డ్ త్రెడ్స్‌తో రెడీ చేశారు. ముఖ్యంగా బ్లౌజ్ మీద వందలాది Diamondsని చేత్తో కుట్టారు, ఈ సారీ కోసం 25 మంది ఆర్టిస్టులు 1200 గంటల పాటు కష్టపడ్డారు. ఆమె మదర్ నీతా అంబానీకి చెందిన కాస్ట్లీ జ్యువెలరీతో పాటు, చేతిలో Mango షేప్ ఉన్న పర్సుతో ఈషా అంబానీ ఫుల్ ట్రెండీగా కనిపించారు.
బానిస బతుకులు వద్దు: పవన్‌పై కానిశెట్టి హరి తిరుగుబాటు!
రాజంపేట ఇన్ఛార్జ్ కానిశెట్టి హరి పవన్ కళ్యాణ్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో విజయ్ కులబలం లేకుండా గెలిస్తే, 25% ఓటు బ్యాంకు ఉన్నా మనం ఎందుకు బానిసలమయ్యామని ప్రశ్నించారు. అయితే, చంద్రబాబును సీఎం చేయడానికి మరో 15 ఏళ్లు ఓపిక పట్టాలని పవన్ ముందే చెప్పారని, ఈ విషయం హరికి తెలియదా అంటూ జనసైనికులు సోషల్ మీడియాలో వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.
పోలీస్ ఆఫీసరా లేక ప్రొఫెషనల్ సింగరా?
మన తెలంగాణ స్టేట్ పోలీస్ ఆఫీసర్ ఒకరు తన voice తో అందరి hearts గెలుచుకున్నారు. రంగబలి సినిమాలోని #EndhayyaSaami పాటను ఆమె ఎంతో మధురంగా పాడారు. present ఈమె పాడిన సాంగ్ సోషల్ మీడియాలో ఫుల్ Viral అవుతోంది. నెటిజన్లు ఆమె singing టాలెంట్‌కు ఫిదా అవుతున్నారు.

అన్నాడీఎంకేలో చీలిక ? విజయ్ కి మద్దతుగా 35 మంది ఎమ్మెల్యేలు
తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. విజయ్ పార్టీ మెజార్టీకి కేవలం 10 సీట్లు దూరంలో ఉండిపోవడంతో ఆయనకు మద్దతు ఇవ్వడానికి పార్టీలు పోటీపడుతున్నాయి. అయిదు సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. విజయ్ దెబ్బకి ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీ చీలిపోయేలా కనిపిస్తోంది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సీవీ షణ్ముగానికి లాయల్ గా ఉండే 35 మంది ఎమ్మెల్యేలు విజయ్ కి మద్దతు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. వారంతా షణ్ముగాన్ని కలిసి విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకి సహకరించాలని చెబుతున్నారు. పార్టీ నిర్ణయం ఏమైనా వారు జంప్ చేస్తారా ? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.

కుర్చీ దిగనంటున్న దీదీ.. రాజ్యాంగం ఏం చెబుతోంది ?
పశ్చిమ బెంగాల్లో ఓడిపోయినా మమతా బెనర్జీ సీఎం పదవి వీడేది లేదంటున్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, గెలిచింది తానేనంటూ రాజీనామాకు నిరాకరించారు. దీంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్. రాజ్యాంగంలో ఆర్టికల్ 164 ప్రకారం గవర్నర్ అభీష్టం మేరకే సీఎం పదవిలో ఉంటారు. కాబట్టి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసే అధికారం గవర్నర్ కు ఉంటుంది. రెండోది ఆర్టికల్ 172 ప్రకారం అసెంబ్లీ గడువు ముగిసిన వెంటనే ఆటోమేటిక్ గా ప్రభుత్వం రద్దయిపోతుంది. మే7తో అసెంబ్లీ గడువు ముగిసిపోనుంది. కాబట్టి ఆ తర్వాత మమత రాజీనామా చేసినా, చెయ్యకపోయినా ప్రభుత్వమైతే ఉండదు.
కోల్ కతాలో టెన్షన్ టెన్షన్.. టీఎంసీ ఆఫీసుని కూల్చేసిన బుల్డోజర్లు
పశ్చిమ బెంగాల్ రిజల్ట్స్ తర్వాత బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నిన్న అర్ధరాత్రి కోల్ కతాలోని హాగ్ మార్కెంట్ ప్రాంతంలో టీఎంసీ యూనియన్ ఆఫీసుని కొందరు వ్యక్తులు బుల్ డోజర్లతో కూల్చేశారు. వారి చేతుల్లో బీజేపీ , ఆరెస్సెస్ జెండాలు ఉన్నాయి. దీంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. మరోవైపు కొందరు బీజేపీ కార్యకర్తలు మటన్ షాపులు మూసివేయాలంటూ వీధుల్లో తిరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

ఎల్ నినో ఎఫెక్ట్ మొదలు … ఇక రుతుపవనాలపై వ్యతిరేక ప్రభావం
ఫసిఫిక్ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా ఎల్ నినో ఎఫెక్ట్ ప్రారంభమైందని Indian National Centre for Ocean Information Services (ఇన్ కాయిస్) ప్రకటించింది. మేలో మొదలైన మార్పులు 2027 జనవరి వరకు కొనసాగుతాయని తెలిపింది. ఎల్ నినో పరిస్థితులు ఏర్పడితే వర్షాలు లేక, కరువు పరిస్థితులు ఉంటాయి. రుతుపవాల్ని అడ్డుకోవడం వల్ల వర్షపాతంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఉత్తర మహాసముద్రంలో వేడి గాలులు ఏర్పడి వాతావరణ సమతుల్యత దెబ్బ తినే ఛాన్స్ కూడా ఉంది.

బంకర్ లో పుతిన్ మకాం..! హత్య చేస్తారని భయపడుతున్న రష్యా అధినేత
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ప్రాణాలకు ముప్పు ఉందన్న ఆందోళనలో ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధంతో దేశ ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. డ్రోన్ దాడులు, అంతర్గత తిరుగుబాటు లేదా హత్యాయత్నం జరగొచ్చన్న భయంతో ఆయన తన నివాసాన్ని భూగర్భ బంకర్లకు మార్చినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. పుతిన్ కు అత్యంత సన్నిహితులే ఈ సమాచారం చెప్పినట్టు వెల్లడించింది. యూరోపియన్ ఇంటెలిజెన్స్ పుతిన్ భద్రతను పెంచి బంకరుకు పంపారని ఎక్కువ సమయం ఆయన అక్కడే గడుపుతూ పరిపాలన సాగిస్తున్నరని వివరించింది.