బంకర్ లో పుతిన్ మకాం..! హత్య చేస్తారని భయపడుతున్న రష్యా అధినేత

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ప్రాణాలకు ముప్పు ఉందన్న ఆందోళనలో ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధంతో దేశ ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. డ్రోన్ దాడులు, అంతర్గత తిరుగుబాటు లేదా హత్యాయత్నం జరగొచ్చన్న భయంతో ఆయన తన నివాసాన్ని భూగర్భ బంకర్లకు మార్చినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. పుతిన్ కు అత్యంత సన్నిహితులే ఈ సమాచారం చెప్పినట్టు వెల్లడించింది. యూరోపియన్ ఇంటెలిజెన్స్ పుతిన్ భద్రతను పెంచి బంకరుకు పంపారని ఎక్కువ సమయం ఆయన అక్కడే గడుపుతూ పరిపాలన సాగిస్తున్నరని వివరించింది.
