← Back to news

అన్నాడీఎంకేలో చీలిక ? విజయ్ కి మద్దతుగా 35 మంది ఎమ్మెల్యేలు

By aravinda nyayapati· 6 May 2026· Chennai
అన్నాడీఎంకేలో చీలిక ? విజయ్ కి మద్దతుగా 35 మంది ఎమ్మెల్యేలు

తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. విజయ్ పార్టీ మెజార్టీకి కేవలం 10 సీట్లు దూరంలో ఉండిపోవడంతో ఆయనకు మద్దతు ఇవ్వడానికి పార్టీలు పోటీపడుతున్నాయి. అయిదు సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. విజయ్ దెబ్బకి ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీ చీలిపోయేలా కనిపిస్తోంది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సీవీ షణ్ముగానికి లాయల్ గా ఉండే 35 మంది ఎమ్మెల్యేలు విజయ్ కి మద్దతు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. వారంతా షణ్ముగాన్ని కలిసి విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకి సహకరించాలని చెబుతున్నారు. పార్టీ నిర్ణయం ఏమైనా వారు జంప్ చేస్తారా ? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.

More in Politics