ఎల్ నినో ఎఫెక్ట్ మొదలు … ఇక రుతుపవనాలపై వ్యతిరేక ప్రభావం

ఫసిఫిక్ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా ఎల్ నినో ఎఫెక్ట్ ప్రారంభమైందని Indian National Centre for Ocean Information Services (ఇన్ కాయిస్) ప్రకటించింది. మేలో మొదలైన మార్పులు 2027 జనవరి వరకు కొనసాగుతాయని తెలిపింది. ఎల్ నినో పరిస్థితులు ఏర్పడితే వర్షాలు లేక, కరువు పరిస్థితులు ఉంటాయి. రుతుపవాల్ని అడ్డుకోవడం వల్ల వర్షపాతంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఉత్తర మహాసముద్రంలో వేడి గాలులు ఏర్పడి వాతావరణ సమతుల్యత దెబ్బ తినే ఛాన్స్ కూడా ఉంది.



