← Back to news

రౌడీ షీటర్‌ను పట్టించిన ఆటో డ్రైవర్..

By sahani· 5 May 2026· X· Hyderabad

హైదరాబాద్‌లో ఒక ఆటో డ్రైవర్ రియల్ హీరో అనిపించుకున్నాడు. బేగం బజార్‌లో ఓ మహిళ మెడలో చైన్ లాక్కొని పారిపోతున్న రౌడీ షీటర్‌ను మహమ్మద్ జాహెర్ అనే ఆటో డ్రైవర్ తన ఆటోతో అడ్డుకున్నాడు. ఎలాంటి ప్రతిఫలం ఆలోచించకుండా. తన ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్‌ను పోలీసులకు పట్టించిన జాహెర్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం తన ఛాంబర్‌లో ప్రత్యేకంగా సన్మానించి, Cash Prize అందించారు. జాహెర్ చూపించిన ధైర్యం ఇప్పుడు సోషల్ మీడియాలో Viral అవుతోంది.

More in News