Latest

జెన్-జీ vs హజిల్ కల్చర్- ఢిల్లీ యువతి పోస్ట్ వైరల్! 🚀
Viral· 1 May 2026

జెన్-జీ vs హజిల్ కల్చర్- ఢిల్లీ యువతి పోస్ట్ వైరల్! 🚀

ఢిల్లీకి చెందిన శృత్రీ త్యాగీ అనే అమ్మాయి LinkedInలో చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎప్పుడూ కష్టపడుతూనే ఉండాలనే Hustle Culture జెన్-జీ కోసమైతే కాదు. అంటూ ఆమె రాస్తూ జెన్-జీ డీల్ మాత్రమే చూసి నో చెప్పేస్తుంది. అలాగని జెన్-జీకి బద్దతం ఎక్కువ అని కాదు, వాళ్లకు అవసరమైన విషయాలపైనే వాళ్లు ఎక్కువ కష్టపడతారు. రాత్రింబవళ్లు కష్టపడే పాత పద్ధతులు ఇప్పటి జనరేషన్‌కు సెట్ కావు ఆమె ఆమె పోస్ట్ చేస్తే మిలియన్ల మంది షేర్ చేసుకున్నారు. మీరేమంటారు? పని ముఖ్యా.. పీస్ ముఖ్యమా? 🤷‍♂️

ఇన్‌స్టాలో 'ఫ్లిప్‌సైడ్' వచ్చేసింది
Viral· 1 May 2026

ఇన్‌స్టాలో 'ఫ్లిప్‌సైడ్' వచ్చేసింది

ఇన్‌స్టాగ్రామ్ కొత్త 'ఫ్లిప్‌సైడ్' ఫీచర్ టెస్ట్ చేస్తోంది. ఒకే అకౌంట్‌లో పబ్లిక్ ప్రొఫైల్, ప్రైవేట్ ప్రొఫైల్ రెండూ మేనేజ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన ఫ్రెండ్స్‌కి మాత్రమే కనిపించే ఫోటోలు, స్టోరీస్ పెట్టుకోవచ్చు. ఈ ఫీచర్ లేకపోవడం వల్ల చాలా మంది ఫ్రెండ్స్ కోసం వేరే అకౌంట్ పెట్టుకున్నారు. ఫ్లిప్ సైడ్ వల్ల రెండో అకౌంట్ లేకుండానే మెయిన్ గ్రిడ్ క్లీన్‌గా ఉంచి, క్లోజ్ ఫ్రెండ్స్‌తో రియల్‌గా, పర్సనల్గా మాట్లాడుకోవచ్చు, నచ్చినవి షేర్ చేసుకోవచ్చు.

AI వల్ల ఈ 5 జాబ్స్‌కి డేంజర్
Technology· 1 May 2026

AI వల్ల ఈ 5 జాబ్స్‌కి డేంజర్

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రిపోర్ట్ ప్రకారం 2027 కల్లా AI వల్ల డేటా ఎంట్రీ, కస్టమర్ సర్వీస్, అకౌంటింగ్ క్లర్క్, సెక్రటరీ, బ్యాంక్ టెల్లర్ జాబ్స్ తగ్గిపోతాయి. కానీ AI స్పెషలిస్ట్, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ అనలిస్ట్ జాబ్స్ పెరుగుతాయి. డిగ్రీతో పాటు AI టూల్స్, ప్రాంప్టింగ్ నేర్చుకుంటే సేఫ్. లేదంటే రిస్క్.

UPI ఇప్పుడు మీ మాటతో డబ్బులు పంపేస్తుంది
Technology· 1 May 2026

UPI ఇప్పుడు మీ మాటతో డబ్బులు పంపేస్తుంది

NPCI 'Hello UPI' ఫీచర్ లాంచ్ చేసింది. ఇక టైప్ చేయకుండా "₹100 రవికి పంపు" అని వాయిస్‌తో చెప్తే చాలు. ఇంగ్లీష్, హిందీ, తెలుగులో పని చేస్తుంది. ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా *99# తో కాల్ చేసి వాడొచ్చు. ఆటోలో ఉంటూ, చేతులు బిజీగా ఉన్నా ఈజీగా పేమెంట్ చేయొచ్చు. సీనియర్ సిటిజన్స్‌కి ఈ ఫీచర్ సూపర్ యూజ్‌ఫుల్.

పంజాబ్ అసెంబ్లీలో హైడ్రామా: సీఎంకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలన్న కాంగ్రెస్▶
Politics· 1 May 2026

పంజాబ్ అసెంబ్లీలో హైడ్రామా: సీఎంకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలన్న కాంగ్రెస్

పంజాబ్ అసెంబ్లీలో మే డే ప్రత్యేక సెషన్ రసాభాసగా మారింది. సీఎం భగవంత్ మాన్ మద్యం మత్తులో సభకు వచ్చారని కాంగ్రెస్, అకాలీదళ్ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై విపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా స్పందిస్తూ.. సీఎంకు వెంటనే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలని, అవసరమైతే సభ్యులందరికీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.గతంలో కూడా సీఎంపై ఇలాంటి ఆరోపణలు రావడంతో విపక్షాలు ఈ ఇష్యూను గట్టిగా పట్టుకున్నాయి. స్పీకర్ ఈ డిమాండ్‌ను తిరస్కరించడంతో కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

ఏమిటీ 'డార్క్ ఈగిల్'? ఇరాన్ పై ప్రయోగానికి అమెరికా సన్నాహాలు
World· 1 May 2026

ఏమిటీ 'డార్క్ ఈగిల్'? ఇరాన్ పై ప్రయోగానికి అమెరికా సన్నాహాలు

అమెరికాపై కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తే హార్ట్ అటాక్ తప్పదని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో అగ్రరాజ్యం తన సీక్రెట్ వెపన్ ను బయటకు తీయడానికి సన్నాహాలు చేస్తోంది.అదే హైపర్ సోనిక్ క్షిపణి డార్క్ ఈగిల్. అమెరికా ఆయుధాల్లో ఇదే అత్యంత వేగవంతమైనది. 15 మీటర్ల పొడవుండే ఈ మిస్సైల్ 1,725 మైళ్ల దూరంలోని లక్ష్యాలను చిటికెలో ఛేదించగలదు. దీని స్పెషాలిటీ ఏంటంటే.. ధ్వని కంటే ఐదు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తూ, గాలిలోనే దిశను మార్చుకోగలదు. అంటే శత్రువుల డిఫెన్స్ సిస్టమ్స్ దీనిని అడ్డుకోవడం అసాధ్యం. స్పేస్ అంచు వరకు వెళ్లి మెరుపు వేగంతో దాడి చేసే డార్క్ ఈగిల్ గ్లోబల్ డిఫెన్స్ లో గేమ్ ఛేంజర్ .

పెద్ది విడుదల తేదీ ఇదే..
Cinema· 1 May 2026

పెద్ది విడుదల తేదీ ఇదే..

రామ్ చరణ్ అభిమానుల వెయిటింగ్ కు తెరపడింది. పెద్ది మూవీని జూన్ 4న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అంతకు ముందు పలుమార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. చివరికి జూన్ 25న రిలీజ్ అనుకున్నారు. కానీ జూన 4న రిలీజ్ కావల్సిన యశ్ టాక్సిక్ మూవీ పోస్ట్ పోన్ కావడంతో పెద్ది మూవీని జూన్ 4న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే మూవీ షూటింగ్ పూర్తయింది.

కరిగిపోయిన డాలర్ డ్రీమ్స్.. అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య
AP· 1 May 2026

కరిగిపోయిన డాలర్ డ్రీమ్స్.. అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య

చికాగో యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసినా ఉద్యోగం రాకపోవడంతో కర్నూలు జిల్లాకు చెందిన ఇరగనబోయిన చందు(26) అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు కోసం తండ్రి చేసిన లక్షల రూపాయల అప్పులు, ప్రస్తుత జాబ్ మార్కెట్ పరిస్థితులు చందును మానసిక ఒత్తిడికి గురిచేశాయి. ఆ ప్రెజర్ భరించలేక నిండు ప్రాణాలు తీసుకున్నాడు. చందు మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు అక్కడి ఇండియన్ కమ్యూనిటీ విరాళాలు సేకరిస్తోంది. కొడుకు మరణవార్త విన్న ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.

 వాటర్ మిలన్ సీడ్స్ రోజూ తింటే ?
Health· 1 May 2026

వాటర్ మిలన్ సీడ్స్ రోజూ తింటే ?

పుచ్చకాయ గింజలు ( వాటర్ మిలన్ సీడ్స్) లో మెగ్నీషియం, ఐరన్, జింక్, హెల్తీ ఫ్యాట్స్ తో కూడిన పోషకాహారం. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడమే కాక, ఇమ్యూనిటీని పెంచి, ఎముకల బలాన్ని పెంచుతాయి. ఇవి షుగర్ లెవెల్స్ ను కూడా బాగా కంట్రోల్ చేస్తాయి. పుచ్చ గింజలను ఓ గుప్పెడు రోజూ కాస్త పెనంపై వేయించుకుని తింటేమంచిది. దీనివల్ల మెగ్నీషియం దొరుకుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. రాత్రిపూట కాలి పిక్కలు పట్టుకు పోయే వారు రోజూ ఇవి తింటే ఫలితం ఉంటుంది.

లంచం అడిగి చెప్పు దెబ్బలు తిన్న అధికారి!▶
Crime· 1 May 2026

లంచం అడిగి చెప్పు దెబ్బలు తిన్న అధికారి!

హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో టికెట్ తనిఖీ అధికారుల తీరు వివాదాస్పదమైంది. రాయకోడ్ వద్ద తనిఖీల్లో ఒక ప్రయాణికుడి వద్ద టికెట్ లేకపోవడంతో, కేసు నమోదు చేయకుండా ఉండేందుకు అధికారి 20 వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన కండక్టర్ మరియు ప్రయాణికులు సదరు చెకింగ్ ఆఫీసర్‌పై చెప్పులతో దాడి చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

బస్సులో ఆడవాళ్ళ కొట్లాట!▶
News· 1 May 2026

బస్సులో ఆడవాళ్ళ కొట్లాట!

విజయనగరం జిల్లా బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు సీటు కోసం జరిగిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఇద్దరు మహిళల మధ్య మొదలైన మాటల యుద్ధం భౌతిక దాడి వరకు వెళ్లింది. ఈ క్రమంలో 14 ఏళ్ల బాలిక బెజ్జుపల్లి భార్గవి తీవ్రంగా గాయపడింది. బాలిక పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైతన్న గుండెలు పిండే ఆవేదన !!▶
TG· 1 May 2026

రైతన్న గుండెలు పిండే ఆవేదన !!

ప్రజల ఆకలి తీర్చడమే తప్ప మరే కల్మషం తెలియని అన్నదాతకు సొంత బిడ్డయినా, తోడుగా నిలిచే పశువులైనా, పంటయినా ఒకటే. వీటిలో ఏది కోల్పోయినా వారి బాధ వర్ణణాతీతం. తాజాగా తెలంగాణ లో నిర్మల్(D)లోని పలు గ్రామాల్లో చేతికందే ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్లతో షార్ట్ సర్క్యూట్ అయి మొక్కజొన్న, వరి, జొన్న పంటలు బూడిదయ్యాయి. దీంతో రైతులు విలపిస్తున్న దృశ్యాలు గుండెలను పిండేస్తున్నాయి. వీరిని ఆదుకోవడం అధికారుల కనీస బాధ్యత.

మరో ఘోరమైన రోడ్డు ప్రమాదం!▶
News· 1 May 2026

మరో ఘోరమైన రోడ్డు ప్రమాదం!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన కారు, అకస్మాత్తుగా ఎదురొచ్చిన బైకర్‌ను తప్పించబోయి అదుపు తప్పింది. ఈ క్రమంలో రెండు బైకులను, రోడ్డు పక్కన ఉన్న వ్యక్తులను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్వీట్ కార్న్ తింటే ఏం జరుగుతుంది?
Health· 1 May 2026

స్వీట్ కార్న్ తింటే ఏం జరుగుతుంది?

కిడ్నీ సమస్యలున్న వారు తరచుగా స్వీట్ కార్న్ తింటే మంచిది. దీనిలో ఉండే ఫెరులిక్ యాసిడ్ లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ కణాల నష్టాన్ని నివారించి కిడ్నీ డ్యామేజ్ తగ్గిస్తాయి. దీనివల్ల కిడ్నీ పనితీరు మెరుగుపడి, కిడ్నీ డ్యామేజ్ అవకుండా ఉంటుంది. స్వీట్ కార్న్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. దీంతో కిడ్నీలపై పడే భారం తగ్గుతుంది.

లోయలో పడ్డ కారు.▶
News· 1 May 2026

లోయలో పడ్డ కారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని ఊనా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పంజాబ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు మాతా చింతపూర్ణి ఆలయ దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా, టైర్ పేలడంతో వీరి కారు నియంత్రణ తప్పి లోతైన లోయలో పడిపోయింది. అతివేగం కారణంగా కారులో మంటలు చెలరేగి ఇద్దరూ అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఈ హృదయవిదారక ఘటన సమీపంలోని సిసిటివి (CCTV) కెమెరాలో రికార్డయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

త్వరలోనే రాబోతున్న "ఫౌజీ"!
Cinema· 1 May 2026

త్వరలోనే రాబోతున్న "ఫౌజీ"!

ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పీరియడ్ యాక్షన్ డ్రామా "ఫౌజీ" (Fauzi) విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్లాన్ ప్రకారం అక్టోబర్‌లోనే థియేటర్లలోకి రానుందని నిర్మాతలు స్పష్టం చేశారు. కేవలం కొన్ని పోరాట ఘట్టాలు మాత్రమే మిగిలి ఉన్నాయని, త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించి దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తామని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతినిధులు వెల్లడించారు.

నాలుగేళ్ల కొడుకుని హగ్ చేసుకొని... గుండెల్ని పిండేస్తున్న బోట్ ప్రమాదం
India· 1 May 2026

నాలుగేళ్ల కొడుకుని హగ్ చేసుకొని... గుండెల్ని పిండేస్తున్న బోట్ ప్రమాదం

మధ్యప్రదేశ్ లోని బర్గి డ్యామ్ లో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో కొన్ని దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి. నాలుగేళ్ల తన కుమారుడిని కాపాడుకోవడానికి ఒక తల్లి చేసిన పోరాటం ఫలించలేదు. తల్లీ కొడుకులిద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకున్న మృతదేహాలు రెస్క్యూ టీమ్ కి దొరికాయి.. కొడుకుని కాపాడుకోవడం కోసం ఆఖరి క్షణం వరకు ఆ తల్లి ఎంత మానసిక క్షోభ అనుభవించిందో తలచుకొని అక్కడున్న అందరూ కన్నీరు కారుస్తున్నారు. జబల్ పూర్ దగ్గర కావేరి నదిలో బర్గి డ్యామ్ లో గురువారం జరిగిన ఈ బోటు ప్రమాదంలో ఇప్పటివరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్
Cinema· 1 May 2026

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్

బాలకృష్ణ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్టుని అఫీషియల్ గా ప్రకటించారు. కొరటాల మార్క్ సోషల్ అవేర్ నెస్ తో బాలయ్య ఫాన్స్ ని అలరించేలా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ ఉండబోతోంది. Power meets purpose.. Mass becomes movement అన్న క్యాప్షన్ ఇచ్చి మూవీపై అంచనాలు పెంచారు.

తల్లీ, కొడుకు ఒకేసారి టెన్త్ పాస్.. వీడియో షేర్ చేసిన లోకేశ్ ▶
Viral· 1 May 2026

తల్లీ, కొడుకు ఒకేసారి టెన్త్ పాస్.. వీడియో షేర్ చేసిన లోకేశ్

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకి చెందిన లక్ష్మీ లహరి, ఆమె కుమారుడు విజయ్ ఇద్దరూ ఒకేసారి టెన్త్ క్లాస్ పాసయ్యారు. ఇద్దరికీ ఫస్ట్ క్లాస్ వచ్చింది. రిజల్ట్ వచ్చాక ఒకరికొకరు కంగ్రాట్స్ చెప్పుకుంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. అయిదో క్లాసు వరకు చదవి ఆపేసిన లక్ష్మి, కుమారుడితో కలిసి టెన్త్ రాయడం ఫస్ట్ క్లాస్ లో పాసవడం రియల్లీ గ్రేట్. ఈ వీడియోని మంత్రి లోకేశ్ షేర్ చేశారు.

డీజీపీగా సీ.వీ. ఆనంద్ బాధ్యతల స్వీకరణ▶
TG· 1 May 2026

డీజీపీగా సీ.వీ. ఆనంద్ బాధ్యతల స్వీకరణ

తెలంగాణ కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ ఆఫీసులో ఆయన సీటులో కూర్చొని తొలి సంతకం పెట్టారు. కొత్త డీజీపీ ఎంట్రీతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఫుల్ జోష్ కనిపిస్తోంది.

ఇరాన్ తో అమెరికా యుద్ధం .. ఆ 60 రోజుల నిబంధన ఏం చెబుతోంది ?
World· 1 May 2026

ఇరాన్ తో అమెరికా యుద్ధం .. ఆ 60 రోజుల నిబంధన ఏం చెబుతోంది ?

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూ ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని టెన్షన్ వాతావరణం ఉన్న వేళ .. ఇరాన్ తో చేసిన యుద్ధం కాల్పుల విరమణతోనే ముగిసిపోయిందని ట్రంప్ యంత్రాంగం చెబుతోంది. అమెరికా ప్రతినిధుల స్పీకర్ మైక్ జాన్సన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇలా ప్లేట్ ఫిరాయించడానికి కారణం ఉంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం మరో దేశంపై యుద్ధాన్ని ప్రకటించే అధికారం కేవలం ఆ దేశ కాంగ్రెస్… అంటే పార్లమెంటుకి మాత్రమే ఉంది. కాంగ్రెస్ ఆమోదం లేకుండా 60 రోజుల వరకు సైన్యాన్ని వినియోగించవచ్చు. ఇరాన్ పై సైనిక చర్య మొదలై ఇవాళ్టితో 60 డేస్ డెడ్ లైన్ ముగుస్తుంది. ఈ నిబంధనల ఉచ్చు నుంచి బయటపడడానికే అదసలు యుద్ధమే కాదంటోంది.