త్వరలోనే రాబోతున్న "ఫౌజీ"!

ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పీరియడ్ యాక్షన్ డ్రామా "ఫౌజీ" (Fauzi) విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్లాన్ ప్రకారం అక్టోబర్‌లోనే థియేటర్లలోకి రానుందని నిర్మాతలు స్పష్టం చేశారు. కేవలం కొన్ని పోరాట ఘట్టాలు మాత్రమే మిగిలి ఉన్నాయని, త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించి దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తామని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతినిధులు వెల్లడించారు.



