Latest

తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీకి వారిద్దరే కారణం
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకానికి వైసీపీ కీలక నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలే కారకులని రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ కమిషన్ తేల్చి చెప్పింది. టీటీడీలో నెయ్యి సరఫరాలో పకడ్బందీగా ఉన్న టెండర్ నిబంధనల్ని మార్చడానికి వీరిద్దరే సిఫార్సు చేశారని నివేదిక ఇచ్చింది. కొనుగోలు కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో చెవిరెడ్డి, భూమనలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని చెప్పింది.

బిర్యానీ, పుచ్చకాయ తిని ముంబైలో నలుగురు మృతి!
ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందడం సంచలనంగా మారింది. బిర్యానీ మరియు పుచ్చకాయ (Watermelon) తిన్న తర్వాత వారి ఆరోగ్యం క్షీణించిందని సమాచారం. బాధితుల కిడ్నీలు దారుణంగా దెబ్బతిన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఆహారంలో విషపూరిత కెమికల్స్ ఉన్నాయా అనే కోణంలో పోలీసులు Investigation చేస్తున్నారు. సమ్మర్‌లో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

4 ఏళ్ల చిన్నారిపై 65 ఏళ్ల వృద్ధుడు చేసిన హత్యాచారం!
కామ కోరికలకు వయసుతో సంబంధం లేదని మరోసారి ఋజువయ్యింది. పూణే జిల్లాలో అత్యంత హేయమైన ఘటన వెలుగుచూసింది. 65 ఏళ్ల వృద్ధుడు ఒక 4 ఏళ్ల చిన్నారిని రేప్ చేసి, ఆపై దారుణంగా హత్య చేశాడు. నిందితుడి వయసు 65 ఏళ్లు అంటే నమ్మలేకపోతున్నారు. ఈ ఘటనతో స్థానికులు నిరసన చేస్తూ రోడ్ల మీదకు వచ్చారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, Fast-track Investigation మొదలుపెట్టారు. చిన్నారి మృతితో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

బుక్స్ ఆన్ ద మూవ్...
మీకు బుక్స్ ఆన్ ది మూవ్ ఉద్యమం తెలుసా? మలేషియాలో కరోల్ అనే లేడీకి పుస్తకాలు చదవడం అంటే ఇష్టం.పుస్తకాల ద్వారా తానెంతో లబ్ది పొందానంటున్న కరోల్ ఆనందాన్ని పంచుకోడానికే బుక్స్ ఆన్ ది మూవ్ అనే ఉద్యమం మొదలు పెట్టింది. కేవలం ఇంట్లో లైబ్రరీల్లోనే కాదు కదిలే రైళ్లు, బస్సులు అన్నిచోటా పుస్తకాలు ఉంచాలి. మీరు చదివేసిన బుక్ అక్కడ వదిలేయండి. దానిపై టేక్ ఇట్, రీడ్ అండ్ డ్రాప్ ఇట్ ఫర్ సమ్ వన్ ఎల్స్ టు ఎంజాయ్ అని స్టికర్ ఉంచండి. దాంతో బుక్స్ సర్క్యులేట్ అవుతాయి అంటోంది. ఇది మనదేశంలోనూ ఢిల్లీ మెట్రో రైళ్లలో ఉంది.. మనం కూడా ఈ పద్ధతి పాటిద్దాం.

9 ఏళ్ల బాలికపై ACP అసభ్య ప్రవర్తన!
ముంబైలోని వర్లీలో ఒక ACP ర్యాంక్ పోలీస్ ఆఫీసర్ (56) తొమ్మిదేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి అరెస్టయ్యాడు. ఒక గార్డెన్‌లో బాలిక ముందు తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతడిని వెంటనే అరెస్ట్ చేసి Judicial Custodyకి పంపారు. నిందితుడిపై Molestation మరియు POCSO Act కింద కేసులు Register అయ్యాయి. రక్షణ ఇవ్వాల్సిన అధికారి ఇలాంటి వెధవ పని చేయడం సంచలనంగా మారింది.
కారును ఓవర్ టేక్ చేయబోయి కింద పడింది !!
చేతిలో మొబైల్ పట్టుకుని స్కూటర్ ను ఫాస్ట్ గా నడుపుతూ ఓ యువతి యాక్సిడెంట్ చేసేసింది. .పంజాబ్ కొట్కాపూర్ లో ఓ యువతి స్కూటర్ నడుపుతూ అటుగా వెడుతున్న కారును ఓవర్ టేక్ చేయడానికి స్పీడ్ పెంచింది. అదే టైమ్ లో మొబైల్ చేతిలో ఉండటం వల్ల ఆమె బ్రేకులు వేయలేక వెనుక టైర్ పైకి లేచి కంట్రోల్ చేయలేక కిందపడిపోయింది. ఆ వెనక వస్తున్న కారు డ్యాష్ కామ్ లో ఇదంతా రికార్డ్ అయింది. ఈ ఘటనలో ఆ యువతికి గాయాలయ్యాయి.

మరణం లోనూ బిడ్డను వీడని తల్లి !!
MPలోని జబల్పూర్లో జరిగిన పడవ ప్రమాద దృశ్యాలు గుండెలను పిండేస్తున్నాయి. నదిలో పడవ మునిగిపోతున్న సమయంలో ఓ తల్లి తన నాలుగేళ్ల కొడుకును కాపాడటానికి ప్రయత్నించినా ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యల్లో ఆ తల్లి మృతదేహం తన బిడ్డను గట్టిగా హత్తుకుని ఉన్న స్థితిలో కనిపించింది. ఊపిరి ఆగిపోతున్నా కొడుకుని మాత్రం వదల్లేదు. మరణంలోనూ వీడని ఆ తల్లి ప్రేమ రెస్క్యూ టీము సైతం కన్నీరు పెట్టించింది.

ORRలో ఘోర ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి!
హైదరాబాద్ ORR పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షంషాబాద్ దగ్గర ఆగి ఉన్న ట్రక్కును అతివేగంతో వస్తున్న కార్ వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు సహా ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. యాదగిరిగుట్ట దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారడమే దీనికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గాయాలయిన వాళ్ళను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ఈ నెలాఖరుకల్లా నైరుతి రాక !!
ఈ ఏడాది ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈనెల 14-15 నాటికి అండమాన్ ను నైరుతి రుతుపవనాలు తాకుతాయని మే నెలాఖరుకి కేరళలోకి ప్రవేశిస్తాయని వాతవరణ అధికారులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాల ముందస్తు రాకతో కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం పడే అవకాశం ఉంది.
కేరళలో ఏనుగు కారును ఎత్తి పడేసింది.!!
కేరళలో ఒక ఏనుగు బీభత్సం సృష్టించింది. కిడం గూర్ మహావిష్ణు ఆలయంలో ఉత్సవాలు జరుగు తుండగా అది అకస్మాత్తుగా అదుపు తప్పింది. కోపంతో అది తన తొండంతో ఒక కారును, స్కూట ర్ల ను పైకి ఎత్తి విసిరేసింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా, మరొకరు గాయపడ్డారు. ఆ తర్వా త , సహాయక బృందాలు రంగంలోకి దిగి దానిని కట్టేశాయి. వేడుకలలో ఏనుగులను ఉపయోగించ కూడదని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. వారిని స్వేచ్ఛగా వదిలేయాలని వారు కోరుకుం టున్నారు•
చెకింగ్ అధికారే లంచం అడిగితే చెప్పుతో కొట్టారు !!
ఆర్టీసీ బస్సులో టికెట్ లేదని రూ.20 వేలు లంచం అడిగినందుకు.. చెకింగ్ అధికారిని కండక్టర్, ప్రయాణికులు కలసి చెప్పుతో కొట్టారు. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ వద్ద హైదరాబాద్ నుండి నారయణ ఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుని టికెట్ స్క్వాడ్ తనిఖీ కోసం ఆపింది.ఒక ప్రయాణికుడి దగ్గర టికెట్ లేకపోవ డంతో కేసు పెట్టకుండా ఉండడానికి ప్రయాణికుడి నుండి, కండక్టర్ నుండి రూ.20 వేల లంచం టికెట్ స్క్వాడ్ డిమాండ్ చేసింది. దాంతో కడుపు మండిన కండక్టర్, ప్రయాణికులు ఆ అధికారిని చెప్పుతో కొట్టారు.
హైదరాబాద్: అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు!
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. స్నేహిత్ (28) అనే వ్యక్తి తన అత్త అరుణపై హెల్మెట్‌తో దాడి చేసి హత్య చేశాడు. బండిపై వెళ్తుండగా ఆమెను కొట్టడంతో, అరుణ కిందపడి తీవ్రంగా గాయపడింది. అది ఫిట్స్ అని అందరినీ నమ్మించి హాస్పిటల్‌లో చేర్చాడు, కానీ ఆమె మరణించింది. చివరకు CCTV Footage బయటపడటంతో అసలు నిజం తెలిసింది. భార్య కావ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి స్నేహిత్‌ను అరెస్ట్ చేశారు
స్వచ్ఛ రథం పథకంపై నాని ఏమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశుభ్రత కోసం ప్రారంభించిన స్వచ్ఛ రథం పథకానికి భారీ స్పందనవస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాలు ఇళ్లకు వెళ్లి చెత్తతో పాటు పనికిరాని వస్తువుల్ని సేకరించి, దానికి బదులుగా వారికి నిత్యావసరాలు, గిఫ్ట్ ఇస్తోంది. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచడానికి యాక్టర్ నాని ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో నాని ఏమన్నారో మీరే చూడండి

నింగిలోకి ఎగరనున్న ప్రైవేటు శాటిలైట్.. బెంగళూరు స్టార్టప్ మిషన్ దృష్టి
బెంగళూరు స్టార్టప్ కంపెనీ గెలాక్సీ ఐ రూపొందించిన ‘మిషన్ దృష్టి’ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా ఈ ప్రైవేట్ శాటిలైట్‌ను రేపు అంటే మే3 న కక్ష్యలోకి పంపనున్నారు. ప్రపంచంలో మొట్టమొదటి ఆప్టో-సార్ (OptoSAR) ఇమేజింగ్ శాటిలైట్ ఇది. మేఘాలు అడ్డుగా ఉన్నా, చీకటిలోనైనా భూమిని హై రిజల్యూషన్ తో ఫోటోలు తీయడం దీని స్పెషాలిటీ. రక్షణ రంగం, వ్యవసాయం , ప్రకృతి విపత్తుల పర్యవేక్షణలో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.

దావూద్ అనుచరుడి ఆటకట్టించిన కొరియర్
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు, అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ సలీమ్ డోలాను టర్కీ ప్రభుత్వం తాజాగా భారత్‌కు అప్పగించింది. ఇస్తాంబుల్‌లో అజ్ఞాతంలో ఉన్న సలీమ్ తాను ఉంటున్న ఇంటికి ఒక కొరియర్ ఆన్ లైన్ లో ఆర్డర్ చేశాడు. అప్పుడు చేసిన ఫోన్ కాల్ తో ఇండియన్ పోలీసులు అతడిని గుర్తించి టర్కీకి సమాచారం అందించారు. అలా అతడు పట్టుబట్టాడు. డ్రగ్స్ నెట్‌వర్క్, టెర్రర్ ఫండింగ్‌లో కీలక పాత్ర పోషించిన సలీమ్ ఇప్పుడు భారత ఏజెన్సీల కస్టడీలో ఉన్నాడు. అండర్ వరల్డ్ ముఠాలకు ఇది భారీ షాక్!

మోగిన ఫోన్ సైరన్... మీకూ వచ్చిందా ?
జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ చేపట్టిన నేషనల్ మొబైల్ సైరన్ అలర్ట్ సిస్టమ్ సక్సెస్ అయింది. ఇవాళ 11.30 తర్వాత రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఫోన్లు పెద్ద శబ్దంతో సైరన్ చేశాయి. ఆ తర్వాత ఇది కేవలం టెస్టింగ్ మాత్రమేనని, ఇది ఆగిపోయాక ఎవరూ ఏమీ చెయ్యనక్కర్లేదంటూ వాయిస్ మెసేజ్ వచ్చింది. భూకంపాలు వంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేయడానికి ఈ సైరన్ వాడతారు. అదెలా పనిచేస్తుందాని ఇవాళ పరీక్షించి చూశారు. ఫ్రెండ్స్ మరీ మీకూ ఈ సైరన్ వచ్చిందా ? కామెంట్ చేయండి

కేంద్ర ఉద్యోగులపై నమ్మకం ఉంచండి : సుప్రీంలో మమతకు షాక్…
సుప్రీం కోర్టులో పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీకి చుక్కెదురైంది. ఎలక్షన్ కమిషన్ (EC) పనితీరుపై తృణమూల్ కాంగ్రెస్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కొట్టి వేసింది. ఓట్ల కౌంటింగ్ టైమ్ లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల్ని నియమించడాన్ని టీఎంసీ తప్పుపట్టడానికి సుప్రీం వ్యతిరేకించింది. ఈసీ నియమంచిన ఉద్యోగులపై నమ్మకం ఉండాలని సుప్రీం చెప్పింది. ప్రతి చిన్న విషయానికి అధికారుల చిత్తశుద్ధిని శంకించలేమని, వ్యవస్థపై కనీస గౌరవం ఉండాలని అభిప్రాయపడింది.

పిల్లల చేతికి ఫోన్ ఇస్తున్నారా? AIIMS షాకింగ్ రిపోర్ట్..
పిల్లలు ఏడుస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! ఏడాది లోపు పిల్లలకు స్క్రీన్ టైమ్ పెరిగితే, 3 ఏళ్లు వచ్చేసరికి ఆటిజం లక్షణాలు వచ్చే ఛాన్స్ ఉందని ఢిల్లీ AIIMS అధ్యయనంలో తేలింది. చిన్న వయసులో పిల్లలకు కావాల్సింది బొమ్మలు, ఆరు బయట ఆటపాటలు, అమ్మమ్మలు చెప్పే కథలే కానీమమొబైల్ స్క్రీన్స్ కాదు. ఫోన్లకు అలవాటు పడితే వారి మెదడు ఎదుగుదల దెబ్బతింటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇక మీ బిడ్డల భవిష్యత్ మీ చేతిలోనే ఉంది. ఏమంటారో కామెంట్ చేయండి

జెన్-జీ వర్సెస్ మిలీనియల్స్: ఎవరు హెల్దీ ?
ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ 'సిగ్నా' నిర్వహించిన గ్లోబల్ వెల్‌బీయింగ్ సర్వేలో జెన్-జీ (1997-2012) ఆరోగ్యంపై సంచలన విషయాలు బయటపడ్డాయి. మిలీనియల్స్ (1981-1996) కంటే జెన్-జీ లోనే ఎక్కువ మందికి హెల్త్ మీద అవేర్ నెస్ ఉంది. జిమ్ డైట్లు, ఫిట్‌నెస్ యాప్స్ వాడడంలో వారే ముందున్నారు. కానీ రియల్ లైఫ్ లో ఆరోగ్యం విషయానికొస్తే జెన్ జీతో పోల్చి చూస్తే ఆ వయసులో మిలీనియల్స్ హెల్దీగా ఉండేవారు. జెన్ జీలో 91% మంది తీవ్రమైన పని ఒత్తిడి (Stress) ఎదుర్కోవడం వారి హెల్త్ ని దెబ్బ తీస్తోంది. కేవలం రీల్స్ కోసమే కాకుండా, రియల్ లైఫ్ హెల్త్ కోసం ఈ జనరేషన్ జాగ్రత్తలు పడాలి. మరి

జర్మనీ బ్లాక్ ఫారెస్ట్ లో మహేశ్
రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న వారణాసి మూవీ మీద క్రేజ్ మామూలుగా లేదు. ఈ మూవీకి సంబంధించిన చిన్న న్యూస్ కూడా వైరల్ అవుతోంది. మహేశ్ ఈ మూవీ కోసం చెమటోడుస్తున్నారు. జర్మనీ బ్లాక్ ఫారెస్ట్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వెల్ నెస్ కోచ్ డాక్టర్ హ్యారీ కోనిగ్ దగ్గర కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. ట్రెక్కింగ్ కు సిద్ధమవుతూ కోచ్ తో ఉన్న ఫోటో షేర్ చేశారు.

మీ ఫోన్ నుంచి సైరన్... భయం వద్దు
ఈ రోజు మీ మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో సైరన్ చేసినా లేదంటే వైబ్రేట్ అయినా అస్సలు భయపడకండి. భూకంపాలు వంటి అత్యవసర సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు 'నేషనల్ మొబైల్ సైరన్ అలర్ట్' సిస్టమ్‌ను జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ పరీక్షిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌ల మొబైల్స్‌కు ఈ టెస్ట్ మెసేజ్ పంపనున్నారు. ఇది కేవలం మీ ఫోన్ యొక్క ఎమర్జెన్సీ అలర్ట్ సామర్థ్యాన్ని చెక్ చేయడానికి మాత్రమే. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో టైమ్ లో ఈ అలెర్ట్ పంపిస్తారు. ఏపీలో 11.15 నుంచి 12 మధ్య, తెలంగాణలో 11.30 నుంచి 12 గంటల మధ్య ఈ అలెర్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది.