లంచం అడిగి చెప్పు దెబ్బలు తిన్న అధికారి!
హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో టికెట్ తనిఖీ అధికారుల తీరు వివాదాస్పదమైంది. రాయకోడ్ వద్ద తనిఖీల్లో ఒక ప్రయాణికుడి వద్ద టికెట్ లేకపోవడంతో, కేసు నమోదు చేయకుండా ఉండేందుకు అధికారి 20 వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన కండక్టర్ మరియు ప్రయాణికులు సదరు చెకింగ్ ఆఫీసర్‌పై చెప్పులతో దాడి చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.



