Latest

అందరికీ “Yes” చెబుతూ.. మనకే “No” ఎందుకు?
ఎవరైనా సహాయం అడిగితే కాదనలేం.. ఫ్రెండ్ పిలిస్తే వెళ్లక తప్పదు.. పని మీద ఆసక్తి లేకపోయినా “సరే” అనేస్తాం. 👀 ఇలా ప్రతి విషయంలోనూ “No” చెప్పలేకపోవడం మొదట మంచితనంలా అనిపిస్తుంది. కానీ క్రమంగా మన సమయం, శక్తి, మనశ్శాంతి అన్నీ ఇతరుల కోసం ఖర్చవుతాయి. పైగా మనకు ఇష్టం లేని పనులకు ఓకే చెప్పి, తర్వాత మనమే ఇబ్బంది పడతాం. “No” అనడం అంటే ఎదుటివారిని అవమానించడం కాదు.. మన హద్దులు మనమే నిర్ణయించుకోవడం. అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తే.. చివరికి మనమే సంతోషంగా ఉండలేకపోవచ్చు.

జీతాల్లేక పారిశుద్ధ్య కార్మికుల భిక్షాటన
AP : అమరావతి పరిధిలోని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు రోడ్డెక్కారు. జూలై నెల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతూ తుళ్లూరు, వెలగపూడి, రాయపూడితో సహా పలు గ్రామాల్లో నిరసనలు చేపట్టారు. వెలగపూడిలో కార్మికులు వినూత్నంగా భిక్షాటన చేసి తమ నిరసన తెలిపారు. నెలలు గడుస్తున్నా జీతాలు రాకపోవడంతో కుటుంబాలు అర్ధాకలితో నరకం చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ, సీఆర్‌డీఏ అధికారులు వెంటనే స్పందించి వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అర్ధరాత్రి పేదల గుడిసెల కూల్చివేత
గోదావరి జిల్లా మండపేటలో పేదలు వేసుకున్న గుడిసెలను అర్ధరాత్రి వేళ పోలీసులు, మున్సిపల్ అధికారులు కూల్చివేయడం దారుణమని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. ఇది ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అరాచక పాలనకు సాక్ష్యమని విమర్శించారు. గోదావరి పుష్కరాల పేరు చెప్పి, ఏళ్ల తరబడి నివాసముంటున్న పేదలను రోడ్డున పడేయడం ఏంటని ప్రశ్నించారు. బాధితులకు కేటాయించిన టిడ్కో ఇళ్లలో తాగునీరు సహా కనీస వసతులు లేవని తెలిపారు. అధికారులంతా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని, అధికార పార్టీ నాయకులకు ఊడిగం చేయడం మానాలని హెచ్చరించారు.

108, 102 సిబ్బందికి అధికారుల వార్నింగ్
రంగారెడ్డి జిల్లా కొందుర్గు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలోని 102, 108 అంబులెన్స్‌లను జిల్లా వైద్య సేవల అధికారులు రాజబాబు, జాన్ షాహిద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని ఈ తనిఖీలు చేశారు. వాహనాల్లో ఆక్సిజన్, మెడిసిన్స్, ఎమర్జెన్సీ మెడికల్ కిట్స్ అన్నీ ఉన్నాయా లేదా అని క్షుణ్ణంగా చెక్ చేశారు. పేషెంట్లకు ఏమాత్రం లేట్ అవ్వకుండా, అంబులెన్స్‌లను 24/7 అందుబాటులో ఉంచాలని స్టాఫ్‌కి ఆదేశించారు.

ఇల్లు పోయినా ఇబ్బంది లేకుండా.. TIDCO ఇళ్లు
AP తూర్పు గోదావరి జిల్లా మండపేటలో పెద్ద కాలువ దగ్గర ఆక్రమణల తొలగింపులో ఇళ్లు కోల్పోయిన పేద కుటుంబాలకు మున్సిపల్ అధికారులు టిడ్కో, రాజీవ్ గృహకల్ప కాలనీల్లో ఇళ్లు ఇచ్చి పునరావాసం కల్పించారు. ఆదివారం ఇళ్లను ఖాళీ చేయించిన వెంటనే వారికి కేటాయించిన ఫ్లాట్లకు తరలించారు. సోమవారం మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు ఆ కాలనీలను సందర్శించి ప్రజలతో మాట్లాడారు. నిర్వాసితులకు ఎలాంటి కష్టం రాకుండా తాగునీరు, కరెంట్, పారిశుద్ధ్యం లాంటి సౌకర్యాలు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఢిల్లీలో సెప్టెంబర్ 5న CJP శాంతియుత నిరసన మార్చ్
Cockroach Janata Party(CJP) సెప్టెంబర్ 5న ఢిల్లీలో జాతీయ స్థాయి శాంతియుత నిరసన మార్చ్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జూలై 25న యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపిస్తూ ఈ అనౌన్స్‌మెంట్ చేసింది. ఈ మార్చ్ ఇండియా గేట్ వద్ద స్టార్ట్ అయ్యి ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వైపు సాగుతుందని తెలిపింది. మరణించిన నీట్ బాధితుల కుటుంబాలు, పోలీస్ దౌర్జన్య బాధితులు ఈ మార్చ్‌కు నాయకత్వం వహిస్తారని తెలిపింది.

ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం
AP : మందస మండలం జిల్లుండ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. తన రెక్కల కష్టంతో భార్యను, దివ్యాంగుడైన కొడుకును పోషిస్తున్న 35 ఏళ్ల రైతు తిరుపతిరావు పొలంలో పనిచేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయారు. 108 సిబ్బంది వచ్చి పరీక్షించేసరికి ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఇంటికి ఆధారమైన వ్యక్తి ఉన్నట్టుండి దూరమవ్వడంతో భార్య, దివ్యాంగ కుమారుడి భవిష్యత్తు ఏమవుతుందోనని కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. ఆ పేద కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఊరి ప్రజలంతా కోరుతున్నారు.

TRSలోకి BRS నేతలు
TG : కామారెడ్డి జిల్లా దేవాయిపల్లికి చెందిన BRS నాయకులు పులి నరేష్, బుయ్య దేవేందర్ తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ వాళ్లకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కల్వకుంట్ల కవిత నాయకత్వంలో అందరినీ కలుపుకొని పోయేందుకు తెచ్చిన ‘పంచజన్యం’ ప్రోగ్రామ్ బాగుందని కొత్తగా చేరిన నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల అధ్యక్షుడు భుజంగరావు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జైల్ సింగ్, లింగంపేట్ మండల అధ్యక్షుడు పోకల సాయిరాం పాల్గొన్నారు.
KGBV వర్కర్లకు బిగ్ రిలీఫ్
నిర్మల్ జిల్లా KGBV నాన్ టీచింగ్ సిబ్బందికి నైట్ డ్యూటీలు తీసేయాలని, వీక్లీ ఆఫ్ ఇచ్చి కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ TUCI ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. సిబ్బందిపై పనిభారం తగ్గించాలని యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్ కోరారు. దీనిపై వెంటనే స్పందించిన కలెక్టర్, కేజీబీవీ సిబ్బందికి వీక్లీ ఆఫ్ అమలు చేయాలని DEOను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రూప, రాజన్న పాల్గొన్నారు.

కేంద్రంపై CJP ఫైర్!
కేంద్ర మంత్రుల అధికారిక బంగళాల మెయింటెనెన్స్ కోసం 2025-26లో ఏకంగా ₹92.35 కోట్లు ఖర్చు చేయడంపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ <a href="https://www.theclearcutnews.com/n/btsDuQ4">(CJP</a>) తీవ్రంగా స్పందించింది. మీ లగ్జరీ ఇళ్లను బాగుచేసుకోవడం ఆపి, ముందు గవర్నమెంట్ స్కూళ్లను రిపేర్ చేయాలని 'X' వేదికగా డిమాండ్ చేసింది. మంత్రుల బంగళాల కోసం ఖర్చు చేసిన ఈ ₹92 కోట్లతో 10 కొత్త వరల్డ్ క్లాస్ స్కూళ్లను నిర్మించవచ్చని, కేంద్రానికి డబ్బులు ఉన్నా స్కూళ్లపై ఉపయోగించే ఉద్దేశం లేదని CJP విమర్శించింది.

ఆటో డ్రైవర్లకు మరాఠీ రూల్ ఎందుకు?
ముంబైలో ఆటో నడపాలంటే డ్రైవింగ్ వచ్చి ఉంటే సరిపోదా? “అవును, సరిపోదు” అంటోంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇక ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు మరాఠీలో కనీసం మాట్లాడటం, అర్థం చేసుకోవడం వచ్చి ఉండాలట. RTO అధికారులు ప్రయాణికులతో మాట్లాడే పరిస్థితులపై 16 ప్రశ్నలు అడుగుతున్నారు. మరాఠీ రాకపోతే ముందుగా నెలరోజుల గడువు ఇస్తారు. అప్పటికీ అవసరమైన స్థాయిలో రాకపోతే బ్యాడ్జ్ సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఈ రూల్‌పై కొందరు డ్రైవర్లు నిరసనకు దిగారు. ప్రభుత్వం మాత్రం ప్రయాణికులతో లోకల్ లాంగ్వేజ్‌లో ఈజీగా మాట్లాడేందుకే ఈ రూల్ అంటోంది.

బహుజనుల రాజ్యంతోనే ప్రజల అభివృద్ధి: డాక్టర్ కదిరి కృష్ణ
TG : తెలంగాణలో బహుజనుల రాజ్యం వస్తేనే ప్రజల జీవితాలు బాగుపడతాయని బహుజన సేన వ్యవస్థాపకులు డాక్టర్ కదిరి కృష్ణ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న BC,SC,ST శ్రామిక వర్గాలకు సరైన వాటా, అధికారాలు దక్కాలని కోరారు. ఇప్పటిదాకా పాలకులు బహుజనులను మోసం చేశారని, ప్రజల తరఫున బహుజన సేన ఎప్పుడూ పోరాడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేష్, చంద్రశేఖర్, నారాయణ పాల్గొన్నారు.

కన్స్యూమర్ కమిషన్‌లో కేసు ఎలా వేయాలి?
AP : వినియోగదారుల హక్కులపై అవగాహన పెంచడానికి డిస్ట్రిక్ట్ కంజ్యూమర్ సొసైటీస్ ఫెడరేషన్ (DCSF) ఆధ్వర్యంలో డుంబ్రిగుడలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 30(ఆదివారం)న ఉదయం 10 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. లాయర్ అవసరం లేకుండా కన్స్యూమర్ కోర్టులో కేసు ఎలా వేయాలి, e-Jagriti ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడం, సరైన పేపర్లు జత చేసి నష్టపరిహారం ఎలా పొందాలో వివరంగా నేర్పిస్తారు. వ్యాపారులు, ప్రజలంతా వచ్చి ఈ అవకాశాన్ని వాడుకోవాలని DCSF చెప్పింది.

స్థానిక ఎన్నికలపై ఫైనల్ డెసిషన్ పవన్‌కళ్యాణ్‌దే: జనసేన
AP: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచనలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుగుతున్నాయని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఈ చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, కూటమి తరఫున అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చలు సాగుతున్నాయని వెల్లడించింది. క్షేత్రస్థాయి నుంచి సేకరించిన సమాచారాన్ని చూసిన తర్వాతే జనసేన పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల విషయంలో పవన్ కళ్యాణ్ తుది నిర్ణయం తీసుకుంటారని క్లారిటీ ఇచ్చింది.

జార్ఖండ్‌లో కొత్త యాత్ర స్టార్ట్!
జార్ఖండ్‌లో రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ సిస్టమ్‌లో సంస్కరణలు తేవడమే లక్ష్యంగా JLKM లీడర్ దేవేంద్ర నాథ్ మహతో ‘భారతి వ్యవస్థ సుధార్ యాత్ర’ను ప్రారంభించారు. మాజీ CM శిబు సోరేన్ జన్మస్థలమైన రామ్‌గఢ్ జిల్లా నెమ్రా గ్రామంలో ఆగస్టు 24న ఈ యాత్రను ఆయన స్టార్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల విధివిధానాలు పారదర్శకంగా ఉండాలని, ఎగ్జామ్ ప్రాసెస్ మారాలని డిమాండ్ చేస్తూ ఈ పోరాటం చేస్తున్నట్లు దేవేంద్ర నాథ్ స్పష్టం చేశారు.

లారీ అసోసియేషన్ ఫైర్
AP : విశాఖపట్నం షీలానగర్ దగ్గర మధ్యప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్‌పై రవాణాశాఖ బ్రేక్ ఇన్‌స్పెక్టర్ డ్రైవర్ పిడిగుద్దులతో దాడి చేయడంతో వివాదంగా మారింది. లారీ ఆపలేదని చెప్పి ఇన్‌స్పెక్టర్ ముందే కొట్టి గాయపరిచారు. ఈ ఘటనపై AP లారీ అసోసియేషన్ ఆందోళనకు సిద్ధమవుతోంది. దెబ్బలు తిన్న డ్రైవర్‌కి ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని అడుగుతున్నారు. డ్రైవర్ల రక్షణ కోసం, వాళ్ల హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటానికి దిగాలని అసోసియేషన్ ప్లాన్ చేస్తోంది.

నా టూర్‌కు NO.. గుజరాత్ CMకు ఎలా అనుమతిచ్చారు?: CM రేవంత్
TG: ఈరోజు సచివాలయంలో CM రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించారు. తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని తెలిపారు. బ్రిటన్ పర్యటనకు కేంద్రం అనుమతించిందని, అమెరికా పర్యటనకు మాత్రం అనుమతి ఇవ్వలేదన్నారు. తన విదేశీ పర్యటనను కేంద్రం అడ్డుకుందని ఆరోపించారు. BJP నేతలు తన పర్యటనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విద్య, క్రీడా రంగాల్లో విదేశీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యమన్నారు. తనకు అనుమతి నిరాకరించి గుజరాత్ CMకు ఎలా అనుమతిచ్చారని కేంద్రాన్ని, BJP ఎంపీలను ప్రశ్నించారు.
లారీ డ్రైవర్‌పై దాడి.. ధర్నాకు లారీ అసోసియేషన్!
AP: విశాఖపట్నంలోని గాజువాకలో లారీ డ్రైవర్‌పై ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ డ్రైవర్ దాడి చేసిన ఘటన కలకలం రేపింది. షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ ఆపలేదని బ్రేక్ ఇన్‌స్పెక్టర్ పార్వతి వెహికల్‌ను ఓవర్‌టేక్ చేసినట్లు తెలుస్తోంది. తరువాత ఇన్‌స్పెక్టర్ దగ్గరే ఆమె డ్రైవర్ లారీ డ్రైవర్‌పై పిడిగుద్దులతో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. దీంతో దారుణంగా దాడి చేశారంటూ ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

రేపు పాలిటెక్నిక్ కాలేజీల బంద్
TG : పాలిటెక్నిక్ కాలేజీలను శక్తి విభాగంలోకి మార్చి, యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీకి కలిపేలా ప్రభుత్వం తెచ్చిన GO 97పై ABVP మండిపడింది. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతూ రేపు పాలిటెక్నిక్ కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది. మన ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను మరింత బాగు చేయాలని అడుగుతున్నారు. ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త నిర్ణయంతో Btechలో నేరుగా సెకండియర్‌లో చేరే (లేటరల్ ఎంట్రీ) అవకాశం ఉండదేమోనని స్టూడెంట్స్ భయపడుతున్నారు.

కాక్రోచ్ పార్టీ డిమాండ్స్ ఇవే!
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ల దారుణమైన పరిస్థితిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఫౌండర్ అభిజీత్ దిప్కే ఎడ్యుకేషన్ మినిస్టర్లకు లెటర్ రాశారు. స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లవుతున్నా స్కూళ్లల్లో మంచి నీరు, టాయిలెట్స్, కనీసం బెంచీలు కూడా లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో రిపేర్లు చేసిన స్కూళ్లు, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు, కేటాయించిన ఫండ్స్ వివరాలను పబ్లిక్‌గా రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

UPI కి 10 ఏళ్లు!
మనం ప్రతీ చిన్నదానికి వాడే 'UPI' వచ్చి 10 ఏళ్లు అవుతుంది. 2016 ఆగస్టు 25న కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రారంభించింది. ఈ దశాబ్ద కాలంలో మన దేశ ఆర్థిక వ్యవస్థకే UPI ఒక వెన్నుముకలా నిలిచింది. 2016-17లో కేవలం 1.78 కోట్లుగా ఉన్న ఏడాది మొత్తం లావాదేవీలు, 2025-26 నాటికి 24,162 కోట్లకు చేరాయని ఆర్థిక శాఖ తెలిపింది. లావాదేవీల సంఖ్య దాదాపు 13 వేల రెట్లు పెరిగింది. లావాదేవీల విలువ 0.07 లక్షల కోట్ల నుంచి 314 లక్షల కోట్లకు చేరి కొత్త రికార్డు సృష్టించింది.