Latest

రేపు పాలిటెక్నిక్ కాలేజీల బంద్
TG· 24 Aug 2026

రేపు పాలిటెక్నిక్ కాలేజీల బంద్

TG : పాలిటెక్నిక్ కాలేజీలను శక్తి విభాగంలోకి మార్చి, యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీకి కలిపేలా ప్రభుత్వం తెచ్చిన GO 97పై ABVP మండిపడింది. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతూ రేపు పాలిటెక్నిక్ కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది. మన ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను మరింత బాగు చేయాలని అడుగుతున్నారు. ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త నిర్ణయంతో Btechలో నేరుగా సెకండియర్‌లో చేరే (లేటరల్ ఎంట్రీ) అవకాశం ఉండదేమోనని స్టూడెంట్స్ భయపడుతున్నారు.

కాక్రోచ్ పార్టీ డిమాండ్స్ ఇవే!
Education· 24 Aug 2026

కాక్రోచ్ పార్టీ డిమాండ్స్ ఇవే!

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ల దారుణమైన పరిస్థితిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఫౌండర్ అభిజీత్ దిప్కే ఎడ్యుకేషన్ మినిస్టర్లకు లెటర్ రాశారు. స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లవుతున్నా స్కూళ్లల్లో మంచి నీరు, టాయిలెట్స్, కనీసం బెంచీలు కూడా లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో రిపేర్లు చేసిన స్కూళ్లు, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు, కేటాయించిన ఫండ్స్ వివరాలను పబ్లిక్‌గా రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

UPI కి 10 ఏళ్లు!
Politics· 24 Aug 2026

UPI కి 10 ఏళ్లు!

మనం ప్రతీ చిన్నదానికి వాడే 'UPI' వచ్చి 10 ఏళ్లు అవుతుంది. 2016 ఆగస్టు 25న కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రారంభించింది. ఈ దశాబ్ద కాలంలో మన దేశ ఆర్థిక వ్యవస్థకే UPI ఒక వెన్నుముకలా నిలిచింది. 2016-17లో కేవలం 1.78 కోట్లుగా ఉన్న ఏడాది మొత్తం లావాదేవీలు, 2025-26 నాటికి 24,162 కోట్లకు చేరాయని ఆర్థిక శాఖ తెలిపింది. లావాదేవీల సంఖ్య దాదాపు 13 వేల రెట్లు పెరిగింది. లావాదేవీల విలువ 0.07 లక్షల కోట్ల నుంచి 314 లక్షల కోట్లకు చేరి కొత్త రికార్డు సృష్టించింది.

అన్ని రాష్ట్రాల విద్యా మంత్రులకు అభిజీత్ దీప్కే లెటర్
Current Affairs· 24 Aug 2026

అన్ని రాష్ట్రాల విద్యా మంత్రులకు అభిజీత్ దీప్కే లెటర్

CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే అన్ని రాష్ట్రాల విద్యా మంత్రులకు లెటర్ రాశాడు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలను దేశం తెలుసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు ఇప్పటికీ సురక్షితమైన నీరు, టాయిలెట్లు, సరైన తరగతి గదులు, కూర్చోవడానికి బెంచీలు లేకుండా చదువుతున్నారని లెటర్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఏ పిల్లవాడూ ఇలాంటి పరిస్థితుల్లో చదువుకోకూడదు. వారిని జంతువుల కంటే ఘోరంగా చూస్తున్నారు” అని పేర్కొన్నారు.

విమెన్ ప్రొటెస్టర్స్ Vs పోలీస్: CJI సంచలన ఆర్డర్!
National· 24 Aug 2026

విమెన్ ప్రొటెస్టర్స్ Vs పోలీస్: CJI సంచలన ఆర్డర్!

NEET ప్రొటెస్ట్ టైమ్‌లో జూలై 20న విమెన్ ప్రొటెస్టర్స్‌పై జరిగిన సెక్సువల్ అసాల్ట్, పోలీస్ దాడిపై సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ కీలక అనౌన్స్‌మెంట్ చేశారు. బాధితులు ఎవరైనా సరే డైరెక్ట్‌గా హై పవర్డ్ ఎంక్వైరీ కమిటీ నోడల్ ఆఫీసర్‌ను కలిసి పోలీసులపై కంప్లైంట్ చేయవచ్చని చెప్పారు. సీనియర్ అడ్వకేట్ శోభా గుప్తా అడిగిన స్పెషల్ సేఫ్టీ రెఫరెన్స్‌పై స్పందించిన CJI, ఈ కమిటీ నోడల్ ఆఫీసర్‌గా లీగల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న జ్యుడీషియల్ ఆఫీసర్ ఉంటారని క్లారిటీ ఇచ్చారు.

‘వారణాసి’ కోసం AI ని పక్కన పెట్టిన రాజమౌళి
Entertainment· 24 Aug 2026

‘వారణాసి’ కోసం AI ని పక్కన పెట్టిన రాజమౌళి

రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. రూ.1,400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 120కి పైగా దేశాల్లో, 50 భాషల్లో విడుదల చేయడానికి రెడీ చేస్తున్నారు. డబ్బింగ్ కోసం ఎలాంటి AI వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీలు వాడకూడదని రాజమౌళి నిర్ణయించుకున్నారు. సినిమాలోని భావోద్వేగాలు సహజంగా ఉండాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,600 మందికి పైగా ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్టులతో స్థానిక యాసలోనే డబ్బింగ్ చెప్పిస్తున్నారని తెలుస్తోంది.

మరోసారి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన విజయ్.. ఈసారి?
National· 24 Aug 2026

మరోసారి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన విజయ్.. ఈసారి?

తమిళనాడు CM విజయ్ ఈరోజు అసెంబ్లీలో కీలక ప్రకటనలు చేశారు. మహిళలకు Free బస్సు ప్రయాణ పథకాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఇకపై ఎక్స్‌ప్రెస్, LSS, డీలక్స్ Govt. బస్సుల్లోనూ మహిళలు Freeగా జర్నీ చేయవచ్చని వెల్లడించారు. ఈ స్కీమ్ అక్టోబర్ 2 నుంచి అమల్లోకి రానుందని అనౌన్స్ చేసారు. అలాగే మహిళలకు సంవత్సరానికి 3 ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు అందిస్తామని ప్రకటించారు. రైతుల వ్యతిరేకత కారణంగా పరందూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు అసెంబ్లీలో తెలిపారు.

హిడింబి: ఆదిమ జాతుల తిరుగుబాటు గాథ
Arts/Literature· 24 Aug 2026

హిడింబి: ఆదిమ జాతుల తిరుగుబాటు గాథ

మహాభారతంలో భీముని భార్య, ఘటోత్కచుని తల్లి హిడింబి. రాక్షస వంశంలో పుట్టి, పాండవుల కథలో కొద్దిసేపు కనిపించి మాయమైపోయిన ఆమెకు సాహిత్యంలో సరైన స్థానం లభించలేదు. ఆ లోపాన్ని పూరించే ప్రయత్నమే నరేష్‌కుమార్ సూఫీ రాసిన ‘హిడింబి’ నవల. ఝాన్సీ పబ్లికేషన్స్ ద్వారా ఈ నవల పబ్లిష్ అయ్యింది. మేజిక్ రియలిజం కోణంలో సాగే ఈ నవలలో దేవతలు, రాక్షసులు ఉండరు. ఆదిమ జాతుల ప్రేమ, త్యాగం, సంస్కృతి, ప్రపంచం గురించి లోతైన విషయాలతో నవల ఆసక్తిగా సాగుతుంది. ఈ నవల త్వరలో మలయాళంలోకి అనువాదమవుతోంది. దీని ధర ₹220. కొనేందుకు <a href="https://amzn.in/d/04Ubx767">లింక్</a>.

‘ఇరుముడి’  కొత్త రికార్డు!
Entertainment· 24 Aug 2026

‘ఇరుముడి’ కొత్త రికార్డు!

హీరో రవితేజ నటించిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజైన మొదటి రోజు నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఫస్ట్ వీకెండ్‌లోనే రూ.80 కోట్ల గ్రాస్ సాధించి, తాజాగా 2026లో ఆదివారం రోజు అత్యధికంగా జనాలు చూసిన సినిమాగా రికార్డు సాధించింది.

KYC.. OTP.. ఇక గ్యాస్ డెలివరీ ఎప్పుడు?
Local· 24 Aug 2026

KYC.. OTP.. ఇక గ్యాస్ డెలివరీ ఎప్పుడు?

చింతపల్లి ఆదివాసీలకు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కోసం క్యూలు కాదు, KYC-OTPలే కొత్త టెన్షన్! బుక్ చేసుకున్నా డెలివరీ రావడం లేదు, ఏజెన్సీల వద్ద వాగ్వాదాలు పెరుగుతున్నాయి. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆదివాసులు ఆరోపిస్తున్నారు. E-KYC ప్రక్రియకు Aug15 వరకు గడువు పెట్టినా, ఇంకా చాలామంది పూర్తి చేయలేదు. సాఫ్ట్‌వేర్ లోపాలు, నెట్వర్క్ సమస్యలు, ఫింగర్ ప్రింట్ ఫెయిలవ్వడం – ఆదివాసీ ప్రాంతాల్లో ఇవి రోజువారీ సమస్యలు. ధరల పెరుగుదల, డెలివరీ జాప్యం – రెండు కలిసి ఆదివాసులను ఇరుక్కునేలా చేస్తున్నాయి.

కర్ణాటకలో భిక్షగత్తె మృతి…ఇంట్లో ₹8.40 లక్షలు
National· 24 Aug 2026

కర్ణాటకలో భిక్షగత్తె మృతి…ఇంట్లో ₹8.40 లక్షలు

జీవితాంతం భిక్షాటన చేస్తూ గడిపిన ఓ మహిళ ఇంట్లో లక్షల రూపాయల నగదు దొరికింది. హూర్(68) తన సోదరితో కలిసి అద్దె ఇంట్లో ఉండేవారు. సోదరి రెండేళ్ల క్రితం మరణించారు. వీళ్లిద్దరూ వివాహం చేసుకోలేదు. ఆదివారం హూర్ మరణించింది. తర్వాత ఇంట్లోకి వెళ్లి చూడగా, 10, 20, 50 రూపాయల నోట్లు, వేలాది నాణేలు కలిపి 30కు పైగా సంచుల్లో కనిపించాయి. మొత్తం ₹8,40,000 ఉన్నట్లు గుర్తించారు. అందులో కొంత సోదరులు తీసుకోగా, మిగిలింది మసీదుకు దానం చేశారు.

శిక్షణ పూర్తయినా సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు?
Local· 24 Aug 2026

శిక్షణ పూర్తయినా సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు?

AP : నర్సీపట్నంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDU-GKY) కింద 3 నెలల కోర్సు పూర్తి చేసిన యువతకు ఇప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. రెండు బ్యాచ్‌ల అభ్యర్థులు శిక్షణ ముగించుకున్నా, ఒక్కరికి కూడా ఇవ్వలేదని, ఉద్యోగ ఇంటర్వ్యూలకు సర్టిఫికెట్లు అత్యవసరమని అభ్యర్థులు బాధపడుతున్నారు. ఆఫీసు సిబ్బందిని ఎన్నిసార్లు అడిగినా దాటవేత సమాధానాలే చెబుతున్నారని అంటున్నారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని సర్టిఫికెట్లు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆ 'శక్తి' మాకొద్దు.... విద్యార్థుల ధర్నా
Local· 24 Aug 2026

ఆ 'శక్తి' మాకొద్దు.... విద్యార్థుల ధర్నా

జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ ఆఫీస్ ముందు పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నాకు దిగారు. శక్తి స్కీమ్ పేరుతో పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ వచ్చిన G.O. 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విలీనం వల్ల B.Techలో లాటరల్ ఎంట్రీ (ECET) దెబ్బతింటుందని, ఫీజులు పెరుగుతాయని, డిప్లొమా విలువ తగ్గుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. PPP మోడల్లో నడిచే YISU ఫీజులు పెంచే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఇది పాలిటెక్నిక్ విద్యను ‘జనరల్ లేబర్ ట్రైనింగ్’గా మారుస్తుందని ఆందోళన.

‘జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ ఫుల్’: హరీశ్ రావు
TG· 24 Aug 2026

‘జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ ఫుల్’: హరీశ్ రావు

TG: తెలంగాణ ప్రభుత్వం 121 రకాల కొత్త మద్యం బ్రాండ్లకు నోటిఫికేషన్ ఇవ్వడంపై BRS లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా మద్యం బ్రాండ్లకు మాత్రం నోటిఫికేషన్లు ఇస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. ‘జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్’ అంటూ <a href="https://x.com/BRSHarish/status/2091778937584308575?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2091778937584308575%7Ctwgr%5E2d1e51a519e130b84159f420033028be9c28718b%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Ftelangana%2Fhyderabad%2Ftelangana-job-notifications-nil-liquor-notifications-full-harish-rao-slams-congress-government-sj-1552344.html">'ఎక్స్'లో</a> ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే.. ప్రభుత్వం లిక్కర్ అమ్మకాలపై ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుందని అన్నారు.

బల్బులు ఉన్నాయ్.. కానీ లైట్‌లేదు!
Local· 24 Aug 2026

బల్బులు ఉన్నాయ్.. కానీ లైట్‌లేదు!

ఓబులాపూర్ ఎస్సీ కాలనీలో వీధి దీపాలు డిస్ప్లే కోసమే పెట్టారేమో! రాత్రి పడితే చాలు – కాలనీ మొత్తం చీకటి మయం. లైట్లు వెలగడం లేదు, ప్రజలు కాంతి కోసం ఫోన్ టార్చ్ ఆన్ చేసుకోవాల్సి వస్తోంది. పిల్లలు బయట ఆడుకోవడానికి భయం, వృద్ధులకు కాలుజారే ప్రమాదం, అంతా పరేషాన్ అవుతున్నారు. బల్బులు పాతవా, ట్రాన్స్ఫార్మర్లు ఫెయిలయ్యాయా.. ఎవరికీ తెలియదు. స్థానికుల డిమాండ్ సింపుల్ – పాత లైట్లు ఫిక్స్ చేయాలి, లేకపోతే కొత్త LED దీపాలు వేయాలి. అధికారులు ఇప్పటికైనా స్పందించాల్సిందే, లేకపోతే సమస్య పెద్దదవుతుంది.

రేబిస్ డాగ్స్ ఇక కనిపించవా?
National· 24 Aug 2026

రేబిస్ డాగ్స్ ఇక కనిపించవా?

కేరళం గవర్నమెంట్ రేబిస్ సోకిన, నయం చేయలేని డిసీజెస్‌తో బాధపడుతున్న అలాగే డేంజరస్‌గా మారిన వీధి కుక్కలకు మెర్సీ కిల్లింగ్ (దయామరణం) చేసేందుకు standard operating procedures (SOP)ని అప్రూవ్ చేసింది. ఈ ఏడాది Mayలో సుప్రీంకోర్ట్ ఇచ్చిన ఆర్డర్ బేస్ చేసుకునే ఈ డెసిషన్ తీసుకున్నారు. దీనికోసం ప్రతి లోకల్ బాడీలో ఒక స్పెషల్ కమిటీని సెటప్ చేస్తారు. ఒక కుక్కకు మెర్సీ కిల్లింగ్ చేయాలా వద్దా అనేదానిపై ఈ కమిటీయే రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఫైనల్ డెసిషన్ తీసుకోనుంది.

వనపర్తిలో భారీ ధర్నా
Local· 24 Aug 2026

వనపర్తిలో భారీ ధర్నా

TG : గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని CITU జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వనపర్తిలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీ ప్రకారం పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని CITU నాయకులు డిమాండ్ చేశారు. మల్టీ పర్పస్ విధానం రద్దు చేసి, వేతనాలను గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా అకౌంట్లలో వేయాలన్నారు. సిబ్బందిని అక్రమంగా తీసేస్తున్న సర్పంచ్‌లపై చర్యలు తీసుకోవాలని, కార్మికులందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, సంక్షేమ పథకాలు అందజేయాలని కోరారు.

రూ.26 వేలు.. 2వ PRCలో గుర్తింపు...
Local· 24 Aug 2026

రూ.26 వేలు.. 2వ PRCలో గుర్తింపు...

వనపర్తిలో సిఐటియు గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా – డిమాండ్లు ఇవే!<br>సోమవారం నిర్వహించిన ఈ ఆందోళనలో యూనియన్ నాయకులు ప్రభుత్వానికి 10 పాయింట్లు ఇచ్చారు. అందులో.. పర్మినెంట్ ఉద్యోగాలు, 2వ PRCలో గుర్తింపు, కనీస వేతనం రూ.26,000, G.O.51 సవరణ, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు, గ్రీన్ ఛానల్ ద్వారా ఆన్లైన్ జీతాలు, తొలగింపులపై చట్టపరమైన చర్యలు, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయింపు వంటివి ఉన్నాయి. ఇవన్నీ కాంగ్రెస్ మానిఫెస్టోలేనివేనని సిఐటియు నాయకులు గుర్తు చేశారు. సర్కారు ఎంతకాలం నానుస్తదో చూడాలి.

కాలేజీలో సడన్‌గా తనిఖీలు
Local· 24 Aug 2026

కాలేజీలో సడన్‌గా తనిఖీలు

TG : షాద్‌నగర్‌లోని గిరిజన సంక్షేమ Degree,PG కాలేజీలో మానవ హక్కుల కమిషన్ ప్రతినిధి ప్రణయ్ కుమార్ టీమ్‌తో కలిసి తనిఖీలు చేశారు. కాలేజీలో పిల్లలకు వసతులు ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉందో దగ్గరుండి చూశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి, 'ఏం కష్టాలున్నా, సమస్యలున్నా మాకు చెప్పండి' అని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్ యాదవ్, అనిల్ కుమార్ పాల్గొన్నారు.

ఆరోగ్యానికి సామ.. సరైన ధర లేదు!
Local· 24 Aug 2026

ఆరోగ్యానికి సామ.. సరైన ధర లేదు!

ఒకప్పుడు ఆదివాసీ ప్రాంతాల్లో విస్తారంగా సాగయ్యే చిట్టిగింజల సామ – ఇప్పుడు అంతరించిపోయే స్థితిలో ఉంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, మన్యం పార్వతీపురం జిల్లాల్లో పాక్షికంగా మిగిలిన ఈ పంట – ఆగస్టు-సెప్టెంబర్లో చేతికొస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలు చెప్పుకుంటే – బీపీ, షుగర్ తగ్గించడంలో సామ బియ్యం సూపర్ అంటారు డాక్టర్లు. అయినా సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల ఆదివాసీ రైతులు ఈ పంటను వదిలేస్తున్నారు. ప్రభుత్వం MSP ప్రకటించి, ప్రోత్సాహకాలు ఇస్తేనే ఈ సాంప్రదాయ పంటకు లైఫ్. లేకుంటే హిస్టరీ బుక్స్ కే పరిమితం.

ప్రభుత్వ హాస్టల్ గోడ కూలి 8వ తరగతి స్టూడెంట్ మృతి
Current Affairs· 24 Aug 2026

ప్రభుత్వ హాస్టల్ గోడ కూలి 8వ తరగతి స్టూడెంట్ మృతి

AP: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు గ్రామంలోని ప్రభుత్వ ఎస్సీ బాయ్స్ హాస్టల్ వద్ద ఆదివారం తీవ్ర విషాదం నెలకొంది. హాస్టల్ పక్కన ఉన్న కాంపౌండ్ వాల్ కూలిపోవడంతో 8వ తరగతి విద్యార్థి హర్షవర్ధన్ మృతి చెందాడు. అతని తండ్రి ఆవేదనతో “లేవు నాన్నా. నీవు లేకుండా నేనేం చేయాలి?” అని ఏడవటం అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. మరో విద్యార్థి అక్షయ్ కాలు విరగడంతో చికిత్స పొందుతున్నాడు.