మెటాలో మళ్లీ లేఆఫ్ లు

టెక్కీలకు ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా మళ్లీ భారీ షాక్ ఇవ్వబోతోంది. మే 20 కల్లా దాదాపు 8,000 మంది ఎంప్లాయీస్ ని తొలగించడానికి సంస్థ సిద్ధమవుతున్నట్టు ఇంటర్నేషనల్ మీడియా కథనాలు రాస్తోంది. మార్క్ జుకర్‌బర్గ్ ఫోకస్ మొత్తం ఇప్పుడు 'AI' మీదకి షిఫ్ట్ అవ్వడమే దీనికి మెయిన్ రీజన్ . ఇన్వెస్ట్‌మెంట్స్ ఏఐకి మళ్లించి, ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డారట. ఇదే కనుక జరిగితే వేలాది మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ఫ్యూచర్ ప్రశ్నార్థకంగా మారబోతోంది.



