← Back to news

కిడ్నాప్ చేసి.. బలవంతంగా మతం మార్చి.. ఆపై పెళ్లి

By Vishi· 1d ago· Indiatimes

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఇద్దరు మైనర్ హిందూ అమ్మాయిలను కిడ్నాప్ చేసి, ఇస్లాం మతంలోకి మార్చి, బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన మైనారిటీ హక్కుల సంస్థల్లో ఆందోళన కలిగించింది. Voice of Pakistan Minority (VOPM) ప్రకారం..తండో అల్లాయార్ జిల్లాలోని ఇబ్రహీం కాలనీ నుంచి 13, 14 ఏళ్ల అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి అంజాద్, మన్సూద్ పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. కోర్టు వాళ్లని సేఫ్ హౌస్‌లో ఉంచింది. “మమ్మల్ని తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్లండి.. ఇంటికి వెళ్లాలని ఉంది” అని ఆ బాలికలు వేడుకుంటున్నారు.

More in International