ఈమె వీర 'వనిత'

మెటర్నిటీ లీవ్ ప్రతి మహిళ హక్కు.. కానీ బెంగళూరులోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ వనిత అనే డాక్టర్ కు పెయిడ్ లీవ్ ఇవ్వలేదు. ఆమె కేసు వేసేందుకు లాయర్ శ్రీకాంత్ చింతలను కలిస్తే 'మీరు కోర్టుకెళ్తే మీ ఉద్యోగం పోతుంది పర్లేదా' అని హెచ్చరించారు. ఆమె 'ఇది డబ్బు కోసం కాదు, నా హక్కు కోసం' అని డెలివరీ తర్వాత కాలేజీపై కేసు వేశారు. కోర్టులో మెడికల్ కాలేజీ ఓడిపోయింది, డాక్టర్ వనిత నెగ్గారు. ఇదంతా లాయర్ శ్రీకాంత్ Facebook వాల్ పై షేర్ చేశారు. డాక్టర్ వీర'వనిత' పోరాటానికి సెల్యూట్ చేస్తూ షేర్ చేద్దామా..?


