← Back to news

గణపతి నిమజ్జనం.. ఆ వెంటనే వర్షం ఎంట్రీ

By Bala· 1d ago

AP: వర్షాభావంతో రాయలసీమలోని పలు చెరువులు, కుంటల్లో నీరు లేక గణనాథుల నిమజ్జనం చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కొన్ని చోట్ల విగ్రహాలను చెరువుల్లో అలాగే ఉంచారు. అయితే గత రెండు రోజులుగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిమజ్జనం అనంతరం కుండపోత వానలు కురవడంతో స్థానికులు షాక్ అయ్యారు. నెలలుగా వర్షం కోసం ఎదురుచూసిన తమ ప్రాంతాల్లో ఇప్పుడు వానలు పడుతున్నాయంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు. “బిడ్డను తీసుకెళ్లేందుకు గంగమ్మే వచ్చింది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

More in Viral