← Back to news

పిల్లల పెంపకంలో ఈ తప్పులు చేయొద్దు!

By Bala· 14h ago
పిల్లల పెంపకంలో ఈ తప్పులు చేయొద్దు!

పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు వారి ఎమోషన్స్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం అత్యవసరం. ప్రతిరోజూ కొంత సమయం వారితో ప్రత్యేకంగా గడపడం వల్ల సేఫ్టీ ఫీలింగ్, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. వారు చెప్పే చిన్న విషయాలను కూడా శ్రద్ధగా వినడం బలమైన అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. తప్పులు చేసినప్పుడు వెంటనే కోపగించుకోకుండా కారణాలు తెలుసుకుని ప్రేమతో సరిదిద్దాలి. గెలుపోటములను సమానంగా స్వీకరించేలా మానసిక దృఢత్వం నేర్పాలి. ఇతరులతో పోల్చి తక్కువ చేయకూడదు-అది ఆత్మన్యూనతను పెంచుతుంది.

More in Parenting