కోతి దాడిలో రచయిత భార్య కన్నుమూత
కర్ణాటకలోని కొప్పల్ జిల్లా బి.టి.పాటిల్ నగర్‌లో కోతి దాడిలో ప్రముఖ రచయిత ఎం.ఎస్. సవదత్తి భార్య నజమున్నిసా బేగం(91) మరణించారు. శనివారం రాత్రి ఇంటి ముందు ఆమెపై దూకిన కోతి తనను తోసేసింది. కింద పడిన ఆమె తలకు తీవ్ర గాయమైంది. ఆమె కూతురు సాయానికి రాగా, కోతి ఆమెపై కూడా దాడి చేసింది. నజమున్నిసాను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి కొంత మెరుగైనా, తర్వాత క్షీణించి మరుసటి రోజు ఆసుపత్రిలోనే మరణించారు.


