← Back to news

రజినీకాంత్ ‘రోబో’ సినిమా.. రియల్‌గా జరిగింది

By Anusha· 1d ago· X

మనిషితో రోబో ఫైట్‌ చేయడం రజినీకాంత్ ‘రోబో’ సినిమాలో చూశాం కదా! అలాంటి సంఘటనే అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగింది. ఆరడుగుల రోబోతో ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఫ్రాంకీ లాపెన్నా బాక్సింగ్‌ రింగ్‌లో తలపడ్డాడు. లాపెన్నా పంచ్‌లు విసరగా, రోబో కిక్కులు, పంచ్‌లతో కౌంటర్‌ ఇచ్చింది. ఓ కిక్‌కు లాపెన్నా కిందపడిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోబోటిక్స్‌ సంస్థ ఆర్‌ఈకే నిర్వహించిన ఈ పోటీ ప్రపంచంలో తొలి మనిషి-రోబో ఫైట్‌ అని తెలిపింది. ట్విస్ట్‌ ఏంటంటే..ఆ రోబోను రిమోట్‌తో ఓ వ్యక్తి ఆపరేట్‌ చేశాడు.

More in International