9 రూపాయలకే చీర ఆఫర్.. చివరకు ఏం జరిగిందంటే!
TG: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తోపులాట జరిగింది. 9 రూపాయలకే చీర ఇస్తామంటూ నిర్వాహకుల భారీ ఆఫర్ ప్రకటించారు. దీంతో మహిళలు ఎత్తున తరలివచ్చారు. ఒక్కసారిగా అందరూ లోపలికి రావడానికి ట్రై చేయడంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని అదుపు చేయలేక చేతులెత్తేశారు. దీంతో తోపులాట జరిగి పలువురు మహిళలకు గాయాలయ్యాయి.



