మోదీ పుట్టినరోజు.. పేదరికం మాత్రం పోలేదు
ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమం నిర్వహించారు. గ్వారీఘాట్‌లో 1.11 లక్షలకు పైగా దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమం తర్వాత కొందరు పిల్లలు, ఇతరులు దీపాల్లో మిగిలిన నూనెను ప్లాస్టిక్ బాటిళ్లలో సేకరిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్ ఈ వీడియోను షేర్ చేస్తూ దేశంలో పేదరికం, ఆర్థిక ఇబ్బందులకు ఇదే నిదర్శనమని కామెంట్ చేశారు.
