స్మశాన వాటిక స్థలం కోసం వినతి

విజయనగరం జిల్లా రేగిడి మండలం బూరాడ గ్రామంలోని దళితులకు స్మశాన వాటిక స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాబ్లమ్‌పై కలెక్టరేట్‌లోని ‘స్పందన’ కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. గ్రామంలోని 50 దళిత కుటుంబాలకు ప్రత్యేక స్థలం లేకపోవడంతో పొలం గట్లు, చెరువు కట్టలపైనే అంత్యక్రియలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 185-5లో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్‌ను కేటాయించాలని కోరారు.

