డిటైన్ చేసినా తగ్గేదే లేదంటున్న నేహా బోరా
ఢిల్లీలో CJP నిరసనల సందర్భంగా AISA లీడర్ నేహా బోరాను పోలీసులు డిటైన్ చేశారు. అయినా ప్రోటెస్ట్ ఆగదని ఆమె ప్రకటించారు. దిల్లీ హాట్ దగ్గర నిరసన కొనసాగిస్తామని, సఫ్దర్‌జంగ్ ఫ్లైఓవర్ దగ్గరకు రావాలని ప్రజలను కోరారు. పోలీసులు ఎక్కడైనా అడ్డుకుంటే అక్కడే కూర్చుని నిరసన కొనసాగించాలని పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు రోడ్డును బ్లాక్ చేసి, నేహా బోరాతో పాటు ఇతర కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. “నేను డిటెన్షన్‌లో ఉన్నా.. ఉద్యమం ఆగదు” అని ఆమె స్పష్టం చేశారు.
