రామన్నపాలెంలో పశు వంధ్యత్వ నివారణ శిబిరం

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం రామన్నపాలెంలో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో పశు వంధ్యత్వ నివారణ క్యాంప్ నిర్వహించారు. సర్పంచ్ జుంజునూరి కృష్ణకుమారి వరప్రసాద్ రిబ్బన్ కట్ చేసి ఈ శిబిరాన్ని స్టార్ట్ చేశారు. ఆవులు, గేదెల్లో ఉన్న సంతానోత్పత్తి ప్రాబ్లమ్స్‌ని గుర్తించి డాక్టర్ సఫియా చెకప్స్ చేసి ట్రీట్‌మెంట్ అందించారు. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ శంకర్ రెడ్డి, పశువైద్య సహాయకుడు గంధం శివ, గోపాలమిత్ర మామిడి కృష్ణ పాల్గొన్నారు.



