పార్క్ చేసిన కారులో మంటలు
హైదరాబాద్లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో పార్క్ చేసి ఉన్న మారుతి సుజుకి ఎర్టిగా కారులో మంటలు చెలరేగాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే కారు ఇంజిన్ భాగం చాలా వరకు దెబ్బతిన్నట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణం ఇంకా తెలియలేదు.


