బరువు తగ్గుతారంటూ నాసిరకం మందులు!

TG: బరువు తగ్గేందుకు ఆన్లైన్లో దొరికే అనుమతి లేని మందులు వాడొద్దని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు హెచ్చరించారు. రెటాట్రూటైడ్, టెసామోరెలిన్ వంటి మందులు, సోషల్ మీడియా ద్వారా కొనుగోలు చేసి వాడుతున్నట్లు గుర్తించారు. వీటితో తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. డాక్టర్ సలహా లేకుండా ఇలాంటి మందులు వాడొద్దని అధికారులు సూచించారు. అనుమతి లేని మందులను అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
