ప్రజావేదికకు పోటెత్తిన జనం.. 214 ఫిర్యాదులు

AP: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సకాలంలో పరిష్కరించాలని అధికారులను డీఆర్వో వి.సుబ్బారావు ఆదేశించారు. కోనసీమ జిల్లా కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అధికారులు వినతులు స్వీకరించారు. భూరికార్డుల ఆన్‌లైన్ నమోదు, రీసర్వే, భూ ఆక్రమణలు, ఉద్యోగాలు, పారిశుధ్యం, మురుగు కాలువల సమస్యలు, ఇళ్ల స్థలాలు, గృహాలు, పింఛన్లు, సదరం సర్టిఫికెట్లు, రహదారుల మంజూరు తదితర అంశాలపై మొత్తం 214 అర్జీలు అందాయి.



