← Back to news

కొబ్బరి చెట్టుపై పిడుగు.. స్థానికుల ఉలిక్కిపాటు

By DK· 1h ago
కొబ్బరి చెట్టుపై పిడుగు.. స్థానికుల ఉలిక్కిపాటు

AP: గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పిడుగు ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విశ్రాంత రవాణా శాఖ ఉద్యోగి ఎం. చిన్నారావు ఇంటి సమీపంలోని కొబ్బరి చెట్టుపై ఆదివారం సాయంత్రం పిడుగు పడింది. పిడుగు ప్రభావంతో కొబ్బరి చెట్టు దెబ్బతిన్నది. భారీ శబ్దంతో ఘటన చోటుచేసుకోవడంతో చుట్టుపక్కల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే పిడుగు పడిన సమయంలో చెట్టు సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

More in Local