← Back to news

ఉప్పునూతలలో మరోసారి గుప్తనిధుల కలకలం

By DK· 1h ago
ఉప్పునూతలలో మరోసారి గుప్తనిధుల కలకలం

TG: నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునూతలలో మరోసారి గుప్తనిధుల తవ్వకాల ఘటన కలకలం రేపింది. గతరాత్రి మండల కేంద్రానికి 2 KM దూరంలోని రంగంపేట రహదారి పక్కన గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు చేపట్టారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే నిందితులు జేసీబీ, రెండు బైకులను వదిలి పరారయ్యారు. వాహనాలను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. తవ్వకాలు ఎవరు చేపట్టారు, గుప్తనిధుల కోసమేనా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జూలైలోనూ గుప్తనిధుల తవ్వకాల ఘటన చోటుచేసుకుంది.

More in Local