గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా APUWJ రాజాం యూనియన్ సభ్యులు నిరసన తెలిపారు. నేరుగా గాంధీజీ విగ్రహానికే వినతిపత్రం ఇచ్చి, నిర్భయంగా నిజాలు రాసే వాతావరణం కల్పించాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్‌కు కూడా వినతిపత్రం అందజేశారు. వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్లు, వెల్ఫేర్ స్కీమ్స్ వెంటనే వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.


