అంగన్వాడీ చిన్నారులకు అక్షరాభ్యాసాలు!

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం లక్ష్మీపురం, కొండగట్ల గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవ కార్యక్రమాలు జరిగాయి. చిన్నారులు, తల్లిదండ్రులకు పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. జయలక్ష్మీపురంలో ఐదుగురు చిన్నారులకు, కొండగట్లలో పలువురు చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. కార్యక్రమాల్లో సర్పంచులు గడిపర్తి శ్రీనివాసరావు, కారుమంచి రజిని, సెక్టార్ సూపర్‌వైజర్ గంగాజలం, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.




