← Back to news

తెలంగాణలో కరెంటు కోతలు.. రైతుల కష్టాలు!

By Krishna· 55m ago· X

TG: తమకు కోతలు లేకుండా, నాణ్యమైన కరెంటును ఇవ్వట్లేదంటూ.. తెలంగాణలో రైతులు రోడ్డెక్కుతున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా.. కోడేరు మండలం.. తీగలపల్లి సబ్‌స్టేషన్‌ ముందు కరెంట్ కోతలకు నిరసనగా రైతులు ఆందోళనకు దిగారు. సబ్‌స్టేషన్‌ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు బావాయిపల్లి, జనంపల్లి, తీగలపల్లి గ్రామాలకు చెందిన రైతులు. అంతరాయం లేకుండా, నాణ్యమైన కరెంట్ సరఫరా చెయ్యాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

More in TG