← Back to news

"హమారా ప్రసాద్‌ని అరెస్టు చెయ్యాలి"

By Krishna· 3h ago

TG: భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఆయన్ను ‘కల్పిత నాయకుడు’గా అభివర్ణిస్తూ పుస్తకం రాసిన హమారా ప్రసాద్‌పై రాజద్రోహం కేసు నమోదు చేసి, తక్షణమే అరెస్టు చెయ్యాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ డిమాండ్ చేశారు. అరెస్టు చెయ్యడం ద్వారా సీఎం రేవంత్ తన సిన్సియార్టీని నిరూపించుకోవాలని కోరారు. హమారా ప్రసాద్‌ను రాష్ట్రం నుంచి బహిష్కరించాలంటూ.. కొత్తగూడెంలో కళ్లకు గంతలు, ప్లకార్డులతో నిరసన తెలిపారు.

More in TG