రుద్రూరులో ఫస్ట్ టైమ్ మట్టి గణపతి

నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో వశిష్ట గణేష్ మండలి ఆధ్వర్యంలో ఫస్ట్ టైమ్ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ఎకో-ఫ్రెండ్లీ ఐడియాతో ముందుకొచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతీ ఒక్కరూ మట్టి గణపతులనే పూజించి పొల్యూషన్ తగ్గించాలని కోరారు. చూడటానికి చాలా అందంగా ఉన్న ఈ విగ్రహాన్ని చూసి గ్రామ ప్రజలు వశిష్ట గణేష్ మండలి సభ్యులను అభినందించారు. మీరు కూడా మీ ఊరి మట్టి గణేశ్‌తో ఫొటోలు తీసుకొని మాకు పంపండి. మేం అందరికీ చూపిస్తాం.

