గుంటూరు జిల్లా కోర్టులో దొంగల కలకలం..

AP: గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోకి అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రూమ్‌లోని బీరువా పగలగొట్టి సుమారు 15 వేల రూపాయల డబ్బు చోరీ చేశారు. POCSO కోర్టులోకి ప్రవేశించి ఫైళ్లను కిందపడేసి తారుమారు చేశారు. పక్కనే ఉన్న అంకమ్మతల్లి ఆలయంలోనూ చోరీకి ప్రయత్నించి, హుండీని బయటకు తీసుకెళ్లి పగలగొట్టారు. CCTV ఆధారంగా పోలీసులు నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నారు.కోర్టు ప్రాంగణంలో చోరీ జరగడంతో భద్రతపై చర్చ మొదలైంది.



