దీక్షకు సంఘీభావం తెలిపిన సీపీఐ, BJP నేతలు

సూర్యాపేటలోని ధర్నా చౌక్‌లో బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్ష మంగళవారం 47వ రోజుకు చేరింది. ఈ దీక్షకు సీపీఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, BJP జిల్లా ప్రధాన కార్యదర్శి చలమల్ల నరసింహ సంఘీభావం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన దీక్షలో పాల్గొన్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బుల్లెట్ ట్రైన్ సాధనే ధ్యేయంగా ఉద్యమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు.


