CM రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన MLA

సికింద్రాబాద్ అడ్డగుట్టకి చెందిన ఆర్యన్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఎమ్మెల్యే పద్మారావు సాయంగా నిలిచారు. CM రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన 6 లక్షల రూపాయల ఎల్ఓసి పేపర్‌ను సీతాఫల్‌మండిలో ఆయన అందజేశారు. హెల్త్ ప్రాబ్లెమ్స్‌తో ఇబ్బందిపడే ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని ఎమ్మెల్యే చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గంలో చాలామందికి సాయం అందించామన్నారు.



