జంతర్ మంతర్ దగ్గర వందల మంది డిటైన్

CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ చెయ్యాలంటూ జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ప్రొటెస్టులో పాల్గొన్న 500 మందికి పైగా యాక్టివిస్టులను పోలీసులు డిటైన్ చేశారు. ఆప్ నేతలు సౌరభ్ భరద్వాజ్, అతిషి, సంజయ్ సింగ్‌తో పాటు AISA, SFI, DYFI స్టూడెంట్ యూనియన్ల యాక్టివిస్టులు నిర్బంధంలోకి వెళ్లారు. S.I.R ద్వారా భారీగా ఓటర్ల పేర్లు తొలగించారంటూ యువత భగ్గుమన్నారు. ఈ దృశ్యాలేవీ నెట్‌లో కనిపించకుండా, పోలీసులు ఇంటర్నెట్ ఫెసిలిటీని రద్దు చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.