← Back to news

26 ఏళ్లుగా నామమాత్రపు అద్దెలు.. బహిరంగ వేలం డిమాండ్!

By Surender Panuganti· 1h ago· Jadcherla (Ct), Jadcherla, Mahabubnagar
26 ఏళ్లుగా నామమాత్రపు అద్దెలు.. బహిరంగ వేలం డిమాండ్!

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో తహసీల్దార్ కార్యాలయం పక్కన టీజీఎన్జీవో వాణిజ్య సముదాయాలున్నాయి. 26 ఏళ్లుగా నామమాత్రపు అద్దెలతో వ్యాపారాలు నడుపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని CITU జిల్లా సహాయ కార్యదర్శి తెలుగు సత్తయ్య ఆరోపించారు. ఈ విషయంపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 4 దుకాణాలను తక్షణమే ఖాళీ చేయించి బహిరంగ వేలం నిర్వహించాలని డిమాండ్ చేశారు! రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు పబ్లిక్ టాయిలెట్లు, కుర్చీలు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలన్నారు.

More in Local