ముంబైలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

తెలుగు కన్నడ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముంబైలోని చాందివలిలో బతుకమ్మ సెలబ్రేషన్స్ జరిగాయి. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ సందడి చేశారు. ఈ ఫెస్టివల్ ద్వారా రెండు రాష్ట్రాల ప్రజలను ఐక్యం చేస్తున్నామని కార్యదర్శి రమేష్ చౌవల్ చెప్పారు. ఈ ఈవెంట్కి లోకల్ ఎమ్మెల్యే దిలీప్ లండేతో పాటు పలువురు నేతలు, నిర్వాహకులు హాజరయ్యారు.



