ముంబైలో బార్బర్.. నెలకు లక్ష రూపాయల ఆదాయం

ముంబైలోని ఒక ప్రొఫెషనల్ తన బార్బర్ గురించి షేర్ చేసిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయన నెలకు లక్ష రూపాయల దాకా సంపాదిస్తున్నాడని, గవర్నమెంట్ జాబ్ ఇచ్చినా తీసుకోనని చెప్పాడని ముంబైకి చెందిన హర్ష్ గుప్తా మధుసూదన్ చెప్పారు. అర్బన్ కంపెనీ ద్వారా వచ్చిన ఈ వ్యక్తి తనకు ఈ వివరాలు చెప్పారని వివరించారు. తన ఆదాయంలో TDS కట్ అవుతుండటంతో రిటర్న్స్ ఫైల్ చేస్తున్నానని, తరచూ రీఫండ్ కూడా వస్తోందని అతను చెప్పినట్టు తెలిపారు.

