కేరళ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల నిరసన
కేరళ కేంద్రీయ విశ్వవిద్యాలయం(Central University of Kerala) పెరియ క్యాంపస్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతీయ సెమినార్‌పై SFIతోపాటు ఇతర విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. మొదటి రోజు కీనోట్ స్పీకర్‌గా ప్రజ్ఞా ప్రవాహ్ జాతీయ కన్వీనర్, RSS ఆలోచనా విభాగానికి చెందిన జె.నందకుమార్ పాల్గొన్నారు. ఇందుకు వ్యతిరేకంగా SFI, AISF, NSUI, KNU, MSF తదితర సంఘాలు “RSS గోబ్యాక్” నినాదంతో నిరసన ప్రదర్శనలు చేశాయి.


