SIR రద్దు చేయాలి.. CEC దిగిపోవాలి: CM రేవంత్ రెడ్డి
TG: ఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ CM రేవంత్ రెడ్డి బారాఖంబా పోలీస్ స్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడారు. SIRను రద్దు చేయాలని, CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో తమ పోరాటం కంటిన్యూ అవుతుందని చెప్పారు. ‘సైమన్ గో బ్యాక్’ తరహాలో ఇప్పుడు ‘SIR గో బ్యాక్’ <a href="https://x.com/Congress4TS/status/2107846666628067829">ఉద్యమం సాగుతోందన్నారు.</a> రాహుల్ అరెస్టుతో మోదీ, అమిత్ షాల అసహనం బయటపడిందని, ED, CBI తర్వాత ఇప్పుడు ECను కూడా BJP ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపించారు.


