← Back to news

నకిలీ ట్రేడింగ్‌ యాప్‌తో మోసం

By A.Ajay· 56m ago
నకిలీ ట్రేడింగ్‌ యాప్‌తో మోసం

TG: హైదరాబాద్‌.. నల్లగండ్లకు చెందిన 65 ఏళ్ల రిటైర్డ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. ఫేస్‌బుక్‌లో వచ్చిన యాడ్ చూసి.. ఓ ట్రేడింగ్ యాప్‌లో షేర్లలో పెట్టుబడి పెట్టారు. కొంతకాలం తర్వాత మనీ వెనక్కి తీసుకుందామంటే రాలేదు. దాంతో అదో నకిలీ ట్రేడింగ్ యాప్ అని అర్థమైంది. ఆయన మొత్తం 98లక్షల 82 వేలు పోగొట్టుకున్నారు. దీనిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇలాంటి యాప్‌లతో అలర్టుగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

More in TG