విపరీతంగా పెరిగిన నిత్యావసరాల ధరలు

దేశంలో సెప్టెంబర్‌లో ధరల పెరుగుదల గత రెండేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరింది. 'Consumer Price Index' ఆధారంగా లెక్కించిన ధరల పెరుగుదల ఆగస్టులో 4.83 శాతంగా ఉన్న ధరల పెరుగుదల సెప్టెంబర్‌లో 5.54 శాతానికి చేరింది. ఆహార పదార్థాల ధరలు ఏడాది క్రితంతో పోలిస్తే 7.74 శాతం పెరిగాయి. ముఖ్యంగా ఉల్లిపాయల ధరల పెరుగుదల 108.09 శాతం పెరిగాయి. దీంతో సామాన్యుల ఇంటి ఖర్చులపై భారం పెరిగింది.



