ప్రెస్ ఐడీ ఉన్నా.. జర్నలిస్టులపై పోలీసుల జులుం

ఢిల్లీలో ప్రొటెస్ట్ కవర్ చేస్తున్న ‘The Indian Express’ హిందీ విభాగానికి చెందిన ముగ్గురు జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాశ్వత్, సియా, విజయ్ కుమార్ అనే ఈ జర్నలిస్టులు ప్రెస్ ID కార్డులు చూపించినా పోలీస్ బస్సులో ఎక్కించారని తెలిపారు. నిరసన స్థలానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో వదిలేశారని చెప్పారు. యుద్ధ సమయాల్లో కూడా రిపోర్టింగ్‌కు అనుమతిస్తారు. కానీ, ప్రొటెస్ట్‌ను కవర్ చేయడానికి పోలీసులు అనుమతించకపోవడంపై ప్రశ్నలు వస్తున్నాయి.



