"పేదలకు ఇళ్లు ఇవ్వాలి" CPM డిమాండ్

విజయవాడ.. పాతబస్తీ 50వ డివిజన్‌లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం CPM నాయకులు నిరాహార దీక్ష ప్రారంభించారు. 5 దశాబ్దాలుగా నివసిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా.. రూల్స్ సాకులు చెప్పడం అన్యాయమనీ, ఇల్లు లేని వారికి 2 సెంట్ల స్థలాలు ఇవ్వాలని CPM AP కార్యదర్శి వర్గ సభ్యులు CH బాబురావు డిమాండ్ చేశారు. కొండప్రాంతాలకు పట్టాలు ఇవ్వాలనీ, 10 లక్షల సాయం చెయ్యాలనీ, నగరాభివృద్ధికి ప్రత్యేక నిధి ఏర్పాటు చెయ్యాలనీ, జీవో 673 రద్దు చెయ్యాలని ఆయన కోరారు.

