పిల్లల్లో కెటమైన్ వాడకం.. మూత్రాశయానికి దెబ్బ!

బ్రిటన్‌లో ‘కెటమైన్’(మత్తుమందు) వాడుతున్న పిల్లల్లో మూత్రాశయం దెబ్బతింటున్న కేసులు పెరుగుతున్నాయి. లివర్‌పూల్‌లోని Alder Hey Hospitalకు 13 ఏళ్ల పిల్లలు కూడా చికిత్సకు వస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఎక్కువకాలం దీన్ని వాడితే మూత్రాశయం లోపలి పొర దెబ్బతిని మూత్రంతోపాటు బయటకు రావచ్చని చెప్పారు. కొందరు దీన్ని ‘జెల్లీఫిష్ పీయడం’లా ఉందంటున్నారు. తరచూ మూత్రం, నొప్పి, రక్తం, కడుపునొప్పి రావచ్చు. పరిస్థితి ముదిరితే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది.



